Thursday, July 30, 2026
23.7 C
Hyderabad

పాక్‌ను కోలుకోకుండా దెబ్బకొట్టాలి!

ముల్లును ముల్లుతోనే తీయాలి. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లుగా ఉండాలి. పాక్‌ ఏర్పడడమే మత ఛాందసవాందతో ఏర్పడిరది. తాము భారత్‌ను చీల్చి ఏర్పడ్డామన్న జ్ఞానం వారిలో లేదు. అలాగే భారత్‌ భిక్షతో దేశంగా ఏర్పడ్డామన్న కృతజ్ఞత బంగ్లాదేశీయులకు లేదు. ఈ రెండు దేశాల్లో మిగిలిన అరకొర హిందువులను తన్ని తరిమేయడం..కశ్మీర్‌ సహా భారత్‌లో చిచ్చుపెట్టడం వీరి లక్ష్యంగా ఉంది. అది ఎప్పుడో రుజువయ్యింది. మనం శాంతి వచనాలు పలుకుతూ పోతే సమస్య పరిష్కారంకాదు. భారత్‌తో పెట్టుకుంటే అంతే సంగతులు అన్న విధంగా మన జవాబు ఉండాలి. రష్యా ఉక్రెయిన్‌పై దాడిచేసింది. ఇజ్రాయిల్‌ పాలస్తీనాపై దాడులు చేస్తూనే ఉంది. ఇలాంటి దెబ్బలు మనం కూడా కొట్టగలగాలి. నష్టం కలిగినా ఫర్వాలేదు. దేశాన్ని పటిష్టం చేసే క్రమంలో మనమంతా త్యాగాలకు సిద్ధపడాలి. ఈ దేశాన్ని వందలాది ఏళ్లుగా ఎందరో దాడులు చేసి ధ్వంసం చేశారు. మనలను బానిసలుగా మార్చారు. ఇవన్నీ మనకు గుణపాఠం కావాలి. ఇంకా దాడులను తట్టుకుంటూ పోదాం అన్న పద్దతి మాత్రం మంచిది కాదు. పహల్గాం దాడి జరిగి వారం రోజులు అవుతోంది. పాక్‌ నుంచి శిక్షణ పొందిన ముష్కరులే దాడికి కారణమని తేలింది. ముంబై దాడులు కావచ్చు..పుల్వామా దాడి కావచ్చు…పహల్గామ్‌ కావచ్చు.. అన్నీ పాక్‌ కుతంత్రాల వల్లనే జరిగిన ఘటనలు. అయినా దాయాది దేశానికి బుద్ది రావడం లేదు. పహల్గాం దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల్లో ఒకడైన హషిమ్‌ మూసా పాక్‌ సైన్యంలో మాజీ పారా కమాండో అని దర్యాప్తులో తేలింది. దీనిని బట్టి పాక్‌ సైన్యంలో పనిచేసిన వారు ఆ తరవాత ఎలా ఉగ్రవాదులుగా మారుతున్నారో గమనించాలి. ప్రస్తుతం అతడు కరుడుగట్టిన టెర్రరిస్టుగా మారినట్లు దర్యాప్తు బృందాలు పేర్కొన్నాయి. పాక్‌కు చెందిన లష్కరే తోయిబాతో కలిసి అతడు పని చేస్తున్నట్లు వెల్లడిరచాయి. ఆ సంస్థ మాస్టర్‌ మైండ్లే అతడిని కశ్మీర్‌కు పంపినట్లు- పేర్కొన్నాయి. ఇప్పటికే భారత సైన్యం ఉగ్రవాదులకు అనుకూలంగా పని చేస్తున్నారన్న అనుమానంతో వందల మంది స్థానికులను అదుపులోకి తీసుకొంది. వీరిలో 15 మంది ఉగ్రవాద ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్స్‌, మూసాకు ఉన్న సైనిక నేపథ్యాన్ని ధ్రువీకరించారని అధికారులు వెల్లడిరచారు. అతడు పాక్‌ స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌ నుంచి లష్కరేలోకి సహాయకారిగా వచ్చినట్లు తెలుస్తోందని సైన్యం ధృవీకరించింది. ఇంతకన్నా ఆధారాలు ఇక అవసరం లేదు. కాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ ఎత్తేసిన తరవాత అక్కడ శాంతి నెలకొనడమే గాకుండా స్థానికులకు ఉపాధి దక్కుతోంది. పర్యాటకం పెరిగింది. అక్కడి యువతలో కూడా మార్పు వచ్చింది. వారంతా జనజీవన స్రవంతిలో కలిసి పోతున్నారు. దీనిని విచ్చిన్నం చేసే పన్నాగమే ఉగ్రదాడి అని తేలింది. కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఘటన అమాన వీయమైనదే కాదు…. మనిషన్నవాడు చేసే పని కాదు. ఇది కేవలం రాక్షస జాతి మాత్రమే చేస్తుంది. పాక్‌ పెంచి పోషిస్తున్న రాక్షసులు భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇందుకుమనం కూడా సన్నద్దం కావాలి. మరణించిన వారి ఆత్మకు శాంతి జరగాలి. ఉగ్రమూకలను చీల్చి చెండాడం ద్వారా మన సత్తా చాటాలి. అలాగే కాశ్మీర్‌లో ఉంటూ…ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న కొందరు పాక్‌ సానుభూతిపరులను కూడా గుర్తించి కఠినంగా శిక్షించాలి. వారిని కూడా ఉగ్రదాడులకు బాధ్యులను చేయాలి. భూతల స్వర్గంగా భావిస్తున్న కశ్మీర్‌ను చూడాలని వెళ్లిన పర్యాటకులను హతమార్చిన ఘటనను ఇప్పటికీ భారతీయులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నరమేధాన్ని ప్రపంచ దేశాలు అన్నీ తీవ్రంగా నిరసించాయి. కేంద్ర ప్రభుత్వం ఇందుకు తగిన విధంగానే ప్రతిస్పందించింది. ఈ దుర్ఘటనకు కారణమైన ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టిఆర్‌ఎఫ్‌)ను, దానికి సహకారం అందించిన లష్కర్‌ ఎ తోయిబాను, దీనికి వెన్నుదన్నుగా ఉన్నదను కుంటున్న పాకిస్థాన్‌ను లక్షంగా చేసుకొని తక్షణ చర్యలు చేపట్టింది. తక్షణమే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను రద్దు చేయడం, నీటి ఒప్పందాలను వెనక్కు తీసుకోవడంతోపాటు ఇంకా అనేక చర్యలు చేపట్టింది. సరిహద్దులను మూసివేయడం కూడా వెంటనే అమలు చేశారు. అదే విధంగా దాడికి బాధ్యులైన వారి లక్షంగా గాలింపు ముమ్మరం చేశారు. ఇవన్నీ ఊహించినవే అయినా సరిపోవని గుర్తించాలి. ప్రజల్లో వస్తున్న తీవ్ర నిరసన కారణంగా దాడులకు తక్షణ చర్యలు ఉండాలి. ఇప్పటికే కాశ్మీర్‌లో వేలాదిమంది పౌరులు, సైనికులు నేలకొరిగారు. వేలాదిమందిని హత్యలు చేశాలరు. లక్షల మందిని మత మార్పిళ్లు చేశారు. ఇవన్నీ గమనించిన తరవాతనే కేంద్రం 2019లో 370 ఆర్టికల్‌ రద్దు చేసి కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని ఎత్తేసింది. దీంతో సాధారణస్థితికి వచ్చి కాశ్మీర్‌ పర్యాటకంగా మళ్లీ చిగురించింది. దీనిని జీర్ణించుకోలేని పాక్‌ పాపాల భైరవులు దాడులకు తెగించారు. ఈ క్రమంలో అసవరమైతే యుద్ధం దాకా కూడా భారత ప్రభుత్వం వెళ్లవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇక పాక్‌ను ఎంతమాత్రం నమ్మరాదు. పాముకు పాలుపోసి పెంచినట్లుగా మన గత పాలకులు పాక్‌ పాలకులకు చేయూతను ఇచ్చారు. అందువల్ల మనం ఎంతమాత్రం ఉపేక్షించరాదు. కష్టమైనా, నష్టమైనా దేశాన్ని ఏకతాటిపైకి తీసుకుని రావాలి. రాజకీయపార్టీలు కూడా విభేదాలు పక్కన పెట్టి పాక్‌కు గుణపాఠం చెప్పే ప్రయత్నాలకు బేషరతు మద్దతు పలకాలి. అలాగే పాక్‌ ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా ప్రతీకార చర్యలు ఉండాలి. అప్పుడే భారత్‌కు శాంతి. గత కొన్నేళ్లుగా మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరుతుంది.

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News