Thursday, July 30, 2026
22.6 C
Hyderabad

ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్‌

ఏడాదిన్నర పాలనలో ఏం చేశారు?

తెలంగాణకు నెంబర్‌ వన్ విలన్‌ కాంగ్రెస్సే

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు

కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్‌ అయ్యిందని, ఏడాదిన్నర పాలనలో ఏం చేశారంటూ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు నిలదీశారు. సంచులు నింపుడు.. మోయడంలోనే కాంగ్రెస్‌ పాస్‌ అయ్యిందంటూ మండిపడ్డారు. వరంగల్‌ శివారులోని ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఒక్కడిగా బయల్దేరి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టానని, 25 ఏళ్లనాడు గులాబీ జెండా ఎగరేశాం.. ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం.. అందరూ అశ్చరపోయేలా పదేళ్లపాటు తెలంగాణను పాలించామని కేసీఆర్‌ అన్నారు.

తెలంగాణకు నెంబర్‌ వన్ విలన్‌ కాంగ్రెస్సే

‘‘తెలంగాణ ఉద్యమం నుంచి వెనక్కిపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పా. ఆనాడు పదవుల కోసం టీడీపీ, కాంగ్రెస్‌ వాళ్లు.. పెదవులు మూశారు. బీఆర్‌ఎస్‌ నేతలు పదవులను త్యాగం చేశారు. ఆనాడైనా ఈనాడైనా తెలంగాణకు నెంబర్‌ వన్ విలన్‌ కాంగ్రెస్సే. ప్రజలు ప్రాణం పోసి ఊపిరి ఊదితే అద్భుతమైన ఉద్యమాన్ని నిర్మించాం. బలవంతంగా ఆనాడు తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేసింది కాంగ్రెస్సే. కాంగ్రెస్‌ మెడలు వంచి తెలంగాణను సాధించుకున్నాం. నేను ఆమరణ దీక్షకు దిగితే కాంగ్రెస్‌ దిగవచ్చి తెలంగాణపై ప్రకటన చేసింది’’ అని కేసీఆర్‌ గుర్తు చేశారు.

డ్యాన్స్‌లు చేసి హామీలు ఇచ్చారు

‘‘పదేళ్ల పాలనలో తెలంగాణను అనేక రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపాం. తెలంగాణ అంటే ఒక్కప్పుడు వెనకబడిన ప్రాంతం. మన పాలనలో రూ.90 వేలు ఉన్న తలసరి ఆదాయం మూడున్నర లక్షలకు పెంచుకున్నాం. మూడేళ్లలో కాళేశ్వరం కట్టుకున్నాం. పడావు భూములను పంటపొలాలుగా మార్చుకున్నాం. పంజాబ్‌ను తలదన్నే పంటలను పండించుకున్నాం. రైతాంగాన్ని కడుపులో పెట్టి చూసుకున్నాం. గోల్‌మాల్‌ చేయడంలో అబద్ధాలను చెప్పడంలో కాంగ్రెస్‌ను మించినవారు లేరు. మాట్లాడితే కేసీఆర్‌పై నిందులు వేస్తున్నారు. ఇక్కడ ఉన్నవాళ్లు చాలరని.. ఢిల్లీ నుంచి గాంధీలు వచ్చి డ్యాన్స్‌లు చేసి హామీలు ఇచ్చారు’’ అంటూ కేసీఆర్‌ మండిపడ్డారు.

ఆశపడి.. కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు మోసపోయారు

‘‘కల్యాణ లక్ష్మికి కేసీఆర్‌ లక్ష రూపాయలే ఇస్తున్నారు.. మేము వస్తే తులం బంగారం కూడా ఇస్తామన్నారు. పెన్షన్లు పెంచుతామన్నారు.. స్కూటీలు కొనిస్తామన్నారు.. జాబ్‌ కార్డులు ఇస్తామన్నారు.. ఇచ్చారా?. ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయన.. ఎన్ని హామీలైనా అమలు చేసి చూపిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న దేవుళ్ల అందరిపైనా ఒట్లు వేశారు. మహిళలే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దని అంటున్నారు. ఆశపడి.. కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు మోసపోయారు. మమ్మల్ని ఎవరూ నమ్మడం లేదు.. అప్పు పుట్టడం లేదని.. ఇప్పుడు కాంగ్రెస్‌ వాళ్లు అంటున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారు.. పరిపాలన చేయడం రాక రాష్ట్రాన్ని ఆగమాగం చేశారు. తెలంగాణను నంబర్‌వన్‌ స్థానంలో నిలబెడితే.. ఇప్పుడు 14వ స్థానానికి తీసుకెళ్లిపోయారు. హైడ్రా పేరు చెప్పి పేదల ఇళ్లు కూలగొడుతున్నారు’’ అని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక నుంచి నేను కూడా ఊరుకోను

యూనివర్శిటీ భూములను ఎవరైనా అమ్ముతారా?. కేసీఆర్‌ కిట్స్‌ను ఎందుకు బంద్‌ చేశారు? ఎవరైనా వాటిని ఆపుతారా?. ఇవాళ హైదరాబాద్‌ యూనివర్శిటీ రేపు ఉస్మానియా యూనివర్శిటీ అమ్మేస్తారు. వైఎస్సార్‌ తెచ్చిన ఆరోగ్యశ్రీని కొనసాగించాలని చెప్పాను. ఆరోగ్యశ్రీ పథకం మంచిది.. కొనసాగించాలని నేను సీఎం అయ్యాక చెప్పాను. ఇప్పుడున్న సీఎం కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తామంటున్నారు. ఇక నుంచి నేను కూడా ఊరుకోను. ఎక్కడ ఎవరు బీఆర్‌ఎస్‌ నేతలపై కేసులు పెట్టినా న్యాయస్థానాల్లో పోరాడదాం. కమీషన్లు అడుతున్నారని కాంట్రాక్టర్లు అంటున్నారు. ఈ సోది కబుర్లు వినడానికి నేను అసెంబ్లీకి రావాలా?’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

ఆపరేషన్‌ కగార్‌ వెంటనే ఆపేయాలి

ఆపరేషన్‌ కగార్‌ వెంటనే ఆపేయాలి. మావోయిస్టులతో చర్చలు జరపాలి. మావోయిస్టులను ఏరిపారేస్తామనడం సరికాదు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు ధైర్యంగా ఉండాలి. తెలంగాణను మళ్లీ అద్భుతంగా చేసుకుందాం. ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన మాకు లేదు. కాంగ్రెస్‌ సంగతేంటో ప్రజలే తేలుస్తారు. పోలీసులు ఎందుకు అత్యుత్సాహం చేస్తున్నారు. పోలీసులు డైరీల్లో రాసుకోండి. మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. బీఆర్‌ఎస్‌ రాకుండా ఎవరు కూడా ఆపలేరు. పోలీసులకు రాజకీయాలు ఎందుకు?. మీ డ్యూటీ మీరు చేయండి’’ అంటూ కేసీఆర్‌ హెచ్చరించారు.

Latest News

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News