Sunday, September 13, 2026
25.2 C
Hyderabad

సంక్షేమమా? సంక్షోభమా!?

ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ. తెలంగాణ ధాన్యాగారం. దిగుబడులలో మనమే నెంబర్ వన్. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంది. కానీ అన్నపూర్ణను చేసిన రైతు అనాథగా మిగిలి, ధాన్యాగారం కాస్తా దళారులకు, మిల్లర్లకు ధనాగారంగా మారి, వరి ఉరైన నెంబర్ వన్ మనమే అవుతున్న దశలను చూస్తున్నాం. ముందు చూపు, విధానమంటూ లేకుండా సాగుతున్న పాలనలో సాగు సావు అవుతున్నది.

ఈ భూమి మీద రెండో అతి పెద్ద జనాభా కలిగిన దేశంగా, ప్రపంచంలోనే అత్యంత పెద్దరంగంగా, అత్యధికులు సాగుపై ఆధారపడే దేశంలో. ఓ వ్యవసాయ విధానమే లేకపోవడం విచిత్రం,. విడ్డూరం. దరిద్రం. రైతే రాజు. అన్నదాత. దేశానికి వెన్నెముక. అంటున్న పాలకులు రైతుల సంక్షేమానికి, వ్యవసాయ రంగ సంక్షోభ నివారణకి గానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు సరికదా, కనీస చట్టాలు కూడా చేయడం లేదు.

దేశంలోని అన్నదాతలను ఆదుకోవడంతో పాటు.. దేశానికి అన్నం పెట్టాలన్న దూరదృష్టి నేతల్లో కొరవడింది. ఏం చేస్తే దేశంలో ప్రజలందరికి ఆహార ధాన్యాలు దక్కగలవో చర్చించడం లేదు. సాగు చట్టాలను రద్దు చేసిన తరవాత కూడా కేంద్రం ఈ సమస్యలపై చర్చించడం లేదు. అన్నదాతల ఆదాయం రెట్టింపు చేస్తానన్న హావిూలు మాటలకే పరిమితం అయ్యాయి. సన్నకారు రైతులకు అండగా ఉన్నానని, ఏటా 6వేల కోట్లు వారి ఖాతాల్లో వేస్తున్నానని గొప్పగా ప్రకటించు కోవడం తప్ప బీజేపీ కేంద్ర ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానానికి శ్రీకారం చుట్టడం లేదు. నిజానికి రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడం కాకుండా వ్యవసాయాన్ని ఆ డబ్బులను పండించే సాగుగా మార్చడం గురించి ఆలోచించడం లేదు. అలాగే వ్యవసాయాధారిత పరిశ్రమలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అభివృద్ది చేయాలి. దీంతో గ్రావిూణ వృత్తులకు కూడా ఆసరా దక్కుతుంది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించడం లేదు. అకాల వర్షాలకు భారీగా పంటలు దెబ్బతింటున్న సందర్భంలో వారికి సకాలంలో పరిహారం అందడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 33 శాతానికంటే ఎక్కువ మొత్తంలో పంటలు దెబ్బతింటేనే నష్ట పరిహారానికి సిఫార్సు చేస్తారు. పంటనష్టం అంతకు మించి ఉంటేనే వ్యవసాయాధి కారులు వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. బీమా చేస్తున్న రైతులకు పరిహారం అందేది నామమాత్రంగానే ఉంటుంది. ఈ నిబంధనలను మార్చాల్సి ఉంది. భారీ వర్షాలతో నష్టపోతే రుణాలు తీసుకున్నవారికి ఈ బీమాను అమలు చేయక పోవడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. నిబంధనల ప్రకారం ఐదేళ్ల ఉత్పత్తి ఆధారంగా ఎంత పంటనష్టం జరిగితే అంతే మొత్తాన్ని అందించనున్నారు. అకాల వర్షాలు భారీగా పంట నష్టాన్ని కలిగించి, రైతుకు కంటివిూద కునుకు లేకుండా చేస్తున్నాయి. చేతికి వచ్చిన పంటను కాపాడు కునేందుకు రైతులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు.

ఇక పంటలను అమ్ముకోవడం ఓ పెద్ద ప్రహనంగా మారింది. ధాన్యం మార్కెట్లోకి తెచ్చిన తరవాత సవాలక్ష కొర్రీలు పెట్టి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. పక్కా మార్కెటింగ్‌ వ్యవస్థ, పంటలను కొనుగోలు చేసే వ్యూహం లేకుండా పోయింది. తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్‌, నీటి సరఫరా, రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, రైతు బీమా, సన్నాలకు క్వింటాకు అదనంగా రూ.500 వంటి పథకాలు అమలవుతున్నాయి. ఇన్ని పథకాలు ప్రవేశ పెట్టి పంటలు కొనుగోలు చేయకపోతే ఎలా? పంటలు అమ్ముకోవడానికి, గిట్టుబాటు ధరల కోసం రైతులు రోడ్డెక్కితే రాజకీయం ఎలా అవుతుంది.? ఇది ఒక్క తెలంగాణ సమస్య మాత్రమే కాదు. దేశం వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్య. ఏ సీజన్‌కు ఆ సీజన్ లో సకాలంలో పంటలు కొనుగోలు చేసి డబ్బులు రైతుల ఖాతాల్లో వేస్తే చాలు. రైతు సమస్యలు సగం తీరినట్లే. కానీ మార్కెట్‌ యార్డుల్లో పడిగాపులు, ధరలు రాకపోవడం, తాలు, తరుగులతో నిలువు దోపిడీయే రైతులకు శాపంగా మారింది. దీనికి తోడు ప్రభుత్వాల నిర్లక్ష్యాలు.

దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దాఖలాలే లేవు. ఎరువులు ఎంత ఎక్కువ వేస్తే అంత అధిక దిగుబడి వస్తుందని భ్రమపడుతున్నారు. దీంతో భూసారం దెబ్బతింటోంది. ఆ పంటలను తింటున్న ప్రజారోగ్యం పరేషాన్ గా మారింది. ఇందుకు భిన్నంగా రైతులకు తాయిలాలు ప్రకటిస్తూ ప్రభుత్వాలు రైతన్నలను మోసం చేస్తున్నాయి. నిర్ధిష్ట విధి విధానాలను రూపొందించాలి. వ్యవసాయ విధానాన్ని, పంటల క్యాలెండర్ ను ప్రకటించాలి. రైతులకు సరైన గైడెన్స్ అందేలా చూడాలి. ఇప్పుడున్న వ్యవసాయ పాలనా వ్యవస్థ సరిగా పని చేసేలా చర్యలు చేపట్టాలి. రైతు బీమా సరే, పంటల బీమా అమలు కావాలి. మిగతా కార్పొరేట్ వ్యవస్థల్లానే రైతులకు, వారి పంటలకు కూడా భరోసా ఉండాలి. వ్యవసాయాధారిత పరిశ్రమలను నెలకొల్పాలి. ప్రోత్సహించాలి. అన్నింటికంటే ముందు భూ సమస్యలను పరిష్కరించాలి. భూ కబ్జాలను అరికట్టాలి. ఇదంతా చూస్తుంటే ఇదేదో చైన్ సిస్టమ్ లా ఒకదానికి ఒకటి ముడి పడి ఉన్న అంశాలు.

ఏవేవో పరిశ్రమల కోసం ప్రపంచ దేశాలు తిరుగుతున్న పాలకులు, వాటి స్థాపనకు విలువైన మన భూములు ఇస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. సరే, వాటి ద్వారా మనవాళ్ళకు అందుతున్న ఉద్యోగాలు ఎన్ని? వాటికంటే, పాలకులకు అందుతున్న మామూళ్ళే ఎక్కువ. ఇక మన వ్యవసాయ విధానాలను మన భూములు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కాకుండా అధ్యయనం పేరుతో విదేశీ విహారాలు చేసి, వాటి విధానాలను మనమీద రుద్దడం సరికాదు. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి.

Latest News

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

సెప్టెంబర్ 11,శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి అమావాస్య ఉదయం 08.35 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పుబ్బ పగలు 02.08 వరకు ఉపరి ఉత్తర యోగం సాధ్య రాత్రి 06.54 వరకు ఉపరి శుభ కరణం నాగవ ఉదయం 08.35 వరకు ఉపరి కింస్తుంఘ్న రాహుకాలం...

గీ సర్, గా అన్నదమ్ముల్ని కలిపింది!?|ADUGU TRENDS

అవుమల్ల.. గది నిజమేనుల్లా... పత్యేక ఓట్ల సవరింపు (సర్) 35 ఏండ్ల కింద యిడిపోయిన అన్నదమ్ముల్ని కలిపింది. గదెట్లనో మీరే సదువుండ్రి. మన తెలంగాణ లెక్కనే గా పంజాబ్ ల సర్ సవరింపులు జరుగుతున్నయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News