జాతిపిత మహాత్మా గాంధీ మనవరాలు నీలాంబెన్ పారిఖ్ (93) మంగళవారం రాత్రి కన్నుమూశారు. గుజరాత్‌లోని నవ్‌సరిలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నీలాంబెన్ మహాత్మా గాంధీ కుమారుడు హరిదాస్ గాంధీ కుమార్తె. ఆమె జీవితమంతా సామాజిక సేవకు అంకితమయ్యారు. బుధవారం ఉదయం 8:00 గంటలకు నవ్‌సరి సమీపంలోని వీర్వాల్ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమె మృతిపట్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, గాంధేయవాదులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. నీలాంబెన్ పారిఖ్ గాంధీ కుటుంబ వారసురాలిగా జీవితమంతా సాదాసీదాగా గడిపారు. ఆమె సేవా స్ఫూర్తి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుంది.

