ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు
శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని తదితరులు
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఈద్గా వద్ద ప్రార్థనలు చేశారు. దేశంలోని ఈద్గా మైదానాలు, మసీదులు, ఇతర ప్రార్థనా స్థలాలు ఉదయం నుంచే ముస్లింలతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచే ముస్లిం సోదరులు నూతన వస్త్రధారణలో, తలపై టోపీ ధరించి, ప్రార్థనలకు వచ్చారు.
ఈద్గా మైదానాల్లో ఇమామ్ల నేతృత్వంలో ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ముస్లింలు ప్రార్థనల అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుని, “ఈద్ ముబారక్” అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ముస్లింలు ఈద్ ప్రార్థనలు చేశారు.
ఈద్ సందర్భంగా ముస్లిం సోదరులు తమ ఇంట్లో ప్రత్యేక వంటకాలలో సేమియా పాయసం, బిర్యానీ, కబాబ్ వంటి ప్రత్యేక భోజనాలను ఏర్పాటు చేసుకొని బంధుమిత్రులతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేదలకు ఆర్థిక సహాయం, దుస్తులు లాంటివి పంపిణీ చేశారు.
దేశవ్యాప్తంగా పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేసింది. ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టి, ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, BRS పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, ఇతర ప్రముఖులు ముస్లిం ప్రజలకు ఈద్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

