Tuesday, September 15, 2026
25.2 C
Hyderabad

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నపై మ‌నంద‌రిని ఏక‌తాటిపై తెచ్చిన త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి గౌర‌వ స్టాలిన్‌ను తెలంగాణ రేవంత్ రెడ్డి అభినందించారు. చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ ఫెయిర్ లో పాల్గొని మాట్లాడారు. పున‌ర్విభ‌జ‌న‌పై మ‌నం అభిప్రాయాలను పంచుకోవాలి.. ఈ విష‌యంలో ద‌క్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నా.. ఇక్క‌డ నా అభిప్రాయాల‌ను మీతో పంచుకుంటున్నానన్నారు. ప్ర‌స్తుతం దేశం పెద్ద స‌వాల్‌ను ఎదుర్కొంటోంది.. బీజేపీ జ‌నాభా జ‌రిమానాల విధానాన్ని కొన‌సాగిస్తోందన్నారు. 1971లో జ‌నాభాను నియంత్రించాల‌ని దేశం నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టి నుంచి ద‌క్షిణాది రాష్ట్రాలు దాన్ని అమ‌లు చేస్తే ఉత్త‌రాదిలోని పెద్ద రాష్ట్రాలు జ‌నాభా నియంత్ర‌ణ‌లో విఫ‌ల‌మ‌య్యాయని చెప్పారు.

ద‌క్షిణాది రాష్ట్రాల‌న్నీ వేగంగా ఆర్థిక వృద్దిని సాధించాయి.. జీడీపీ, త‌ల‌స‌రి ఆదాయం, వేగంగా ఉద్యోగాల క‌ల్ప‌న‌, మెరుగైన మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, సుప‌రిపాల‌న‌, సంక్షేమ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లో మంచి ప్ర‌గ‌తి సాధించాయని, దేశ ఖ‌జానాకు మ‌నం పెద్ద మొత్తంలో నిధులు ఇస్తూ త‌క్కువ మొత్తాన్ని పొందుతున్నామన్నారు. త‌మిళ‌నాడు ప‌న్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే 29 పైస‌లే వెన‌క్కి వ‌స్తుంటే… ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు రూపాయికి రెండు రూపాయ‌ల 73 పైస‌లు వెన‌క్కి వెళుతున్నాయని చెప్పారు. అలాగే బీహార్‌ రూపాయి చెల్లిస్తే రూ. 6.06 వెన‌క్కి పొందుతోంది. రూపాయిలో క‌ర్ణాట‌క‌కు కేవ‌లం 14 పైస‌లు, తెలంగాణ‌కు 41 పైస‌లు, కేర‌ళ‌కు 62 పైస‌లు మాత్ర‌మే వెన‌క్కి వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో మ‌ధ్య ప్ర‌దేశ్ రూపాయి ప‌న్ను రూపంలో కేంద్రానికి ఇస్తే.. రూ. 1.73 పైసలు వెనక్కు ఇస్తుందని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.

ద‌క్షిణాది రాష్ట్రాల‌కు కేంద్రం కేటాయింపులు.. ప‌న్ను చెల్లింపులు క్ర‌మంగా త‌గ్గిస్తోంది.. చివ‌ర‌కు జాతీయ ఆరోగ్య మిష‌న్ కేటాయింపుల్లోనూ ఉత్త‌రాది రాష్ట్రాల‌కే 60 నుంచి 65 శాతం నిధులు ద‌క్కుతున్నాయని ఈ విషయంలో కూడా మనమంతా పోరాడాలన్నారు. మ‌నది ఒకే దేశం.. మ‌నం దానిని గౌర‌విస్తాం.. కానీ ఈ పున‌ర్విభ‌జ‌న‌ను మ‌నం అంగీక‌రించం.. ఎందుకంటే ఇది దక్షిణాది రాష్ట్రాల రాజ‌కీయ కుదింపు.. మంచి ప్ర‌గ‌తి సాధిస్తున్న రాష్ట్రాల‌ను ఈ ప్ర‌క్రియ శిక్షిస్తోంది. ఈ అస‌మ‌గ్ర‌మైన పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ చేప‌ట్ట‌కుండా మ‌నం బీజేపీని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీట్లు పెంచొద్దు.. ఉన్న సీట్ల‌తోనే పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ చేప‌ట్టాలి… 1976లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం అలానే పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టింది. లేకుంటే రాష్ట్రాల మ‌ధ్య రాజ‌కీయ తేడాలు (అస‌మ‌తౌల్యాలు) వ‌చ్చేవి అన్నారు. 2001లో ప్ర‌ధాన‌మంత్రి వాజ్‌పేయీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌ను అలానే ప్రారంభించింది. లోక్‌స‌భ సీట్ల‌ను అదే సంఖ్య‌లో ఉంచుతూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అదే విధంగా చేయ‌గ‌ల‌రా? అని ప్రశ్నించారు.

అలాగే తన రెండో పాయింట్‌… జ‌నాభా దామాషా ప్రాతిప‌దిక పున‌ర్విభ‌జ‌ను ద‌క్షిణాది వ్య‌తిరేకిస్తోందన్నారు. బీజేపీ ప్ర‌తిపాదిస్తున్న జ‌నాభా దామాషా ప‌ద్ద‌తిలో పున‌ర్విభ‌జ‌న చేప‌డితే ద‌క్షిణాది రాష్ట్రాలైన మ‌నం రాజ‌కీయ గ‌ళం కోల్పోతాం. మ‌న‌ల్ని ఉత్త‌రాది ద్వితీయ శ్రేణి పౌరులుగా త‌గ్గించివేస్తుంది. జ‌నాభా ప్రాతిపదిక‌న పున‌ర్విభ‌జ‌న చేప‌డితే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఛత్తీస్‌గ‌ఢ్ వంటి రాష్ట్రాలు దేశంపై ఆధిప‌త్యం చ‌లాయిస్తాయ‌ని ఇక్క‌డ ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ అంగీకరిస్తారు. ఏ ప‌రిస్థితుల్లోనూ మ‌నం దీనికి అంగీక‌రించ‌కూడ‌దని హితవు పలికారు. బీజేపీ అనుస‌రిస్తున్న ఈ విధానానికి వ్య‌తిరేకంగా ద‌క్షిణాది ప్ర‌జ‌లు, పార్టీలు, నాయ‌కులు ఏకం కావాలని విజ్ఞప్తి చేశారు. మూడో పాయింట్‌… ప్రొరేటా విధానాన్ని అంగీక‌రించ‌లేమన్నారు. ప్రొరేటా విధానం కూడా ద‌క్షిణాదికి న‌ష్ట‌మే క‌లిగిస్తుంది.. ప్రొరేటా ప్ర‌క్రియ కూడా రాజ‌కీయ అంత‌రాల‌ను పెంచుతుంది. ప్రొరేటా విధానాన్ని పాటిస్తే సీట్ల మ‌ధ్య తేడా కేంద్ర ప్ర‌భుత్వ ఏర్పాటును నిర్ణ‌యిస్తుంది.. ఒక్క సీటు కూడా తేడాను చూపుతుందన్నారు. ఒక్క సీటుతో కేంద్ర ప్ర‌భుత్వం ప‌డిపోయిన చ‌రిత్ర మ‌న దేశంలో ఉంది. కాబ‌ట్టి ప్రొరేటా విధానం కూడా ద‌క్షిణాది రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లిగిస్తుందన్నారు.

మ‌రి మ‌నం అంగీక‌రించే ఆప్ష‌న్లు ఏమిటంటే… ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మాజీ ప్ర‌ధాన‌మంత్రి వాజ్‌పేయీ విధానాన్ని పాటించ‌డ‌మే… మ‌రో 25 ఏళ్ల‌పాటు లోక్‌స‌భ సీట్ల‌లో ఎటువంటి మార్పు తీసుకురావ‌ద్దు అన్నారు. సీట్ల సంఖ్య‌లో మార్పు లేకుండా పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ చేప‌ట్టాలి..పున‌ర్విభ‌జ‌న‌కు రాష్ట్రాన్ని యూనిట్ తీసుకొని చేయాలి.. అన్నారు. రాష్ట్రాల్లోని జ‌నాభా ఆధారంగా పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టాలని, రాష్ట్రాల్లోని న‌గ‌రాలు, గ్రామాల్లోని జ‌నాభా ఆధారంగా లోక్‌స‌భ సీట్ల హ‌ద్దుల‌ను మార్పు చేయాలన్నారు. తాజా జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ సీట్ల సంఖ్య పెంచాలన్నారు. ప్ర‌తి రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాలి అని డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే లోక్ స‌భ స్థానాల పెంపును మ‌రో 25 ఏళ్ల‌పాటు వాయిదా వేయాలన్నారు.

తాను తెలంగాణ‌లోని మ‌ల్కాజిగిరి ఎంపీగా చేశాను.. అది ప్ర‌పంచంలోనే అతి పెద్ద నియోజ‌క‌వ‌ర్గం.. అక్క‌డ మొత్తం జ‌నాభా 45 ల‌క్ష‌లైతే ఓట‌ర్లు 32 లక్ష‌లు.. కాబ‌ట్టి నేను ఈ స‌మ‌స్య‌ను పూర్తిగా అర్ధం చేసుకున్నాను అన్నారు. పార్ల‌మెంట్ దేశానికి విధాన‌ప‌ర‌మైన శాస‌నాల‌ను రూపొందిస్తుందే త‌ప్ప ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌పై నిర్ణ‌యాలు చేయ‌దు. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన ముఖ్య‌మైన స‌మ‌స్య‌ల‌ను స్థానిక సంస్థ‌లు, రాష్ట్రాలు, శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోనే ప‌రిష్కారమ‌వుతాయన్నారు. ఫైనల్ గా చూపించే ప‌రిష్కారం… జ‌నాభా నియంత్ర‌ణ‌కు సంబంధించి ద‌క్షిణాది రాష్ట్రాలను శిక్షించే విధానానికి కేంద్రం స్వ‌స్తి చెప్పాలి… దేశ నిర్మాణంలో 1975 నుంచి 2025 వ‌ర‌కు 50 ఏళ్ల పాటు మ‌నం అందించిన సేవ‌ల‌కు మ‌న‌ల్ని అభినందించాలి. మ‌న‌కు వెన‌క్కి కొంత చెల్లించాలని, జ‌నాభా దామాషా ప్రాతిపదిక‌న చేసే పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టొద్ద‌ని ద‌క్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు.

లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి దేశంలోని ఇత‌ర రాష్ట్రాలతో సంబంధం లేకుండా చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీట్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లే ద‌క్షిణాదికి అవ‌కాశం ఇవ్వాలని చెప్పారు. అలాగే మంచి ప్ర‌గ‌తి సాధించిన ద‌క్షిణాది రాష్ట్రాల‌కు పార్ల‌మెంట్ సీట్లలో మంచి వాటా ఇవ్వ‌డం ద్వారా ఇత‌ర రాష్ట్రాలు ఆర్థిక వృద్ది, సుప‌రిపాల‌న‌పై దృష్టి సారించేలా చేయాలన్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీజేపీ పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ చేప‌ట్టాల‌నుకుంటే 543 సీట్లు ఉన్న లోక్‌స‌భ‌లో ప్ర‌స్తుతం ద‌క్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య 130.. ఇది మొత్తం సీట్ల‌లో 24 శాతం.. పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత ఏర్ప‌డే నూత‌న లోక్‌స‌భ‌లో మాకు 33 శాతం సీట్లు ఇవ్వాల‌నేది ద‌క్షిణాది రాష్ట్రాలుగా మా డిమాండ్‌ అని చెప్పారు.

బీజేపీ 50 శాతం సీట్ల‌ను పెంచాల‌నుకుంటే అలా పెరిగే 272 సీట్ల‌తో మొత్తం లోక్ స‌భ సీట్ల సంఖ్య 815 అవుతుంది. ఇందులో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు 33 శాతం అంటే 272 సీట్లు ఇవ్వాలి…ఈ సీట్ల‌ను ద‌క్షిణాదిలోని త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, పుదుచ్చేరిల‌కు ఇప్పుడున్న‌ ప్రొరేటా ప్రాతిప‌దిక‌న పంచ‌వ‌చ్చన్నారు.దేశంలో మిగిలిన సీట్ల‌ను ఉత్త‌రాది, ఇత‌ర రాష్ట్రాల‌కు కేంద్రం త‌మ అభిమ‌తం మేర‌కు పంచ‌వ‌చ్చు.. అనుకున్న దానికంటే ద‌క్షిణాది రాష్ట్రాల‌కు సీట్ల సంఖ్య త‌గ్గిస్తే అది దేశ రాజ‌కీయ రంగంపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుందన్నారు. ద‌క్షిణాదిలోని అన్ని రాష్ట్రాలు, రాజ‌కీయ పార్టీలు మ‌న విభేదాల‌ను విస్మ‌రించి పున‌ర్విభ‌జ‌న‌లో మ‌న వాటా ద‌క్కించుకునేందుకు ఐక్యంగా పోరాడాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నానన్నారు.

పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌పై మా రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో త్వ‌ర‌లోనే తీర్మానం ఆమోదిస్తాం… మేం మా రాష్ట్రంలో ఎలా చేస్తున్నామో మీ మీ రాష్ట్రాల్లోనూ అలానే చేయాల‌ని స‌హ‌చ‌ర ముఖ్య‌మంత్రులు, ఇత‌ర నాయ‌కులకు విజ్ఞ‌ప్తి చేశారు. ద‌క్షిణ భార‌త‌దేశ పౌరుల గ‌ళాన‌ని బ‌లంగా, ఐక్యంగా మొత్తం భార‌త దేశానికి వినిపిద్దాం అని పిలుపునిచ్చారు. పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌పై త‌ర్వాత స‌మావేశాన్ని హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తాను.. మ‌న పోరాటాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ‌దామ‌నే విష‌యాన్ని ఆ స‌మావేశంలో చ‌ర్చిద్దాం…. ఈ పోరాటంలో ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వామ్యం చేసేందుకు ఒక భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేసుకుందాం అన్నారు. ద‌క్షిణ భార‌త‌దేశానికి చెందిన అన్న‌త‌మ్ముళ్లు.. అక్కా చెల్లెళ్లంతా క‌లిసి వ‌చ్చి.. మ‌న హ‌క్కుల ర‌క్ష‌ణ‌కు క‌లిసి రావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Latest News

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News