పాలకుర్తి ఎమ్మెల్యే, జనగామ జిల్లా ఇరిగేషన్ అధికారులకు పాలకుర్తి, దేవరుప్పుల మండలాల రైతుల తరపున చెక్ డ్యాంలు, చెరువులు నింపాలని బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పల్లా సుందర్ రామ్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ…. సోషల్ మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పంట పొలాలు ఎండిపోతున్నాయి. కోలుకొండ కొత్త చెక్ డ్యాం వరకు నీళ్లు వచ్చినాయి. కానీ చౌడూరు, రాంభోజీ గూడెం, కడవెండి, దేవరుప్పుల, కామారెడ్డి గూడెం, చిన్న మాడురుకు ఇప్పటివరకు నీళ్లు రాలేదు. నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మా BRS పార్టీ ప్రభుత్వంలో వున్నప్పుడు కేసీఆర్ గారి నేతృత్వంలో, ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో ఎండాకాలంలో కూడా అన్ని ఊర్లకు నీళ్లు ఇచ్చినం. మీరు కూడా నీరు ఇస్తారా లేదా, అసలు వాటర్ ఫెసిలిటీ వుందా అనే విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం వుంది. రైతులు ఎదురుచూస్తున్నారు. ఇక్కడ నవాబ్పేట నుండి సింగారాజుపల్లి, పెద్ద మాడూరు, కడవెండి, సీతారాంపురం, ధరవత్ తండా, కామారెడ్డి గూడెం, దేవరుప్పుల చెరువులు నింపాల్సి వస్తుంది. ఘనపూర్ ఆయకట్టు నుండి మదాపురం, ధర్మాపురం, కడవెండి, దేవరుప్పుల గోపి చెరువులు నింపాలి. గుండాల నుండి వచ్చే కాలువ నుండి పెద్ద మాడూరు, రామారాజుపల్లి, నీర్మాల చెరువు, దుగ్గి చెరువు నింపాల్సి వుంది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బోర్లలో కూడా నీళ్లు లేవు. ఇది రాజకీయాలకు సమయం కాదు దయచేసి యుద్ధ ప్రాతిపదికన ఇరిగేషన్ అధికారులతో కూర్చోని ఈ చెరువులను, చెక్ డ్యాంలను నింపాలని BRS పార్టీ తరపున ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

