మాజీ సీఎం కేసీఆర్ లాంటి వాళ్లు తెలిసి ఒళ్లు బలిసి కులగణనలో పాల్గొనలేదని సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అలాంటి వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలని, వారికి తెలంగాణలో జీవించే హక్కు లేదని చెప్పారు.బీఆర్ఎస్ నేతలు కాకి లెక్కలు చూపి తమ సర్వే తప్పు అంటున్నారని మండిపడ్డారు. జనాభా లేకపోయినా రావులంతా కలిసి పదవులు పంచుకున్నారని దుయ్యబట్టారు.KTR, హరీశ్, పోచంపల్లి గ్యాంబ్లర్లు అని విమర్శించారు

