వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో మంగళవారం ఉదయం అరెస్ట్ చేసిన పోలీసులు, అనంతరం విజయవాడకు తరలించారు. వంశీపై బీఎన్‌ఎస్ సెక్షన్ 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) ప్రకారం కేసులు నమోదు చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా ఆరోపణలు మోపారు. ఈ అరెస్ట్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. పోలీసుల చర్యపై వంశీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం అధికారిక ప్రకటన వేచి చూడాల్సి ఉంది.

