ప్రతి ఎకరాకు సాగునీరు
కర్కాలలో ఎమ్మెల్యే యశస్విని రాజరామ్మోహన్ రెడ్డి
పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూరు మండలం, కర్కాల గ్రామంలో ఇటీవల సాగునీటి కొరత సమస్య ఏర్పడటంతో స్థానిక నాయకులు ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి, వారు స్వయంగా వెళ్లి బయన్న వాగు రిజర్వాయర్‌ను పరిశీలించి, అధికారులతో సమీక్షించి తక్షణం నీటిని విడుదల చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, కొందరు చిల్లరగాళ్లు తాము నీటిని విడుదల చేయించామని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు నిజాన్ని గ్రహించి మోసపూరిత ప్రచారాలను తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. కర్కాల రైతులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలియచేస్తూ…. సన్మానించారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు మార్కెట్ చైర్మెన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి, సీనియర్ నాయకులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు, మహిళలు, రైతులు, యువజన నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


