Thursday, July 30, 2026
23.7 C
Hyderabad

పాలకుర్తిలో బి ఆర్ ఎస్ కు దెబ్బ మీద దెబ్బ

గాంధీ భవన్ లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ సమక్షంలో చేరిన బిల్లా సుధీర్, సురేందర్ తదితరులు

పాలకుర్తి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కి చెందిన జెడ్పీ కో ఆప్షన్ మాజీ సభ్యుడు మహమ్మద్ మదార్ కాంగ్రెస్ లో చేరి రెండు రోజులు గడవకముందే ఇదే నియోజకవర్గానికి చెందిన వరంగల్ జిల్లా మరో బి ఆర్ ఎస్ నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, ఆకుల సురేందర్ పార్టీకి రాజీనామా చేసి, తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. గాంధీ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో టి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పి ఆయనకు ఆహ్వానం పలికారు. ఈ చేరికతో బిఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగిలినట్లు అయింది.

ఈ సందర్భంగా టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ మాట్లాడుతూ, అవినీతిలో కూరుకుపోయిన బిఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు కూడా వీడుతూ గుణపాఠం చెబుతున్నారన్నారు. వీరితో పాటు మరికొందరు కూడా చేరనున్నారని, ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, ఝాన్సీరెడ్డి ల నాయకత్వంలో పాలకుర్తిలో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తున్నది. పార్టీ పాలన నచ్చి వీళ్లంతా వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేసిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని, రాబోయే స్థానిక ఎన్నికల్లో బి ఆర్ ఎస్ డిపాజిట్లు కోల్పోయి, కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కొత్త పాత ల మేలు కలయికతో సమన్వయంగా పని చేస్తామని చెప్పారు.

బిల్లా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో బిఆర్ఎస్ నాయకత్వం అవినీతిలో కూరుకుపోయి, ప్రజలను మోసం చేస్తూ, అనుచరులనే వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. త్వరలోనే బి ఆర్ ఎస్ ఖాళీ అవడం ఖాయం అన్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇన్‌చార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

https://youtu.be/OIVrOfxjsXY?si=MffN43nN0FC0v3OW

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News