నిన్న పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జనగామ జిల్లా తాజా మాజీ జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మొహమ్మద్ మదార్ ఈ రోజు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వ కంగా కలిశారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ…. మీరు ఎలాంటి వారో అందరికీ తెలుసని, మీరు పార్టీలో రావడం అభినందనీయం అని, పార్టీ పటిష్టతకు అహర్నిశలు కృషి చేయాలన్నారు.


