ఈ నెల 24 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 28వ తేదీ లేదా మార్చి 3వ తేదీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. BAC సమావేశం అనంతరం అసెంబ్లీ సదస్సు యొక్క సమయం గురించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.

