టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఫోటోల మార్ఫింగ్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఆయన పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. 2024 నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీపై టిడిపి నేత ఫిర్యాదు చేశారు.
ఆర్జీవీ తన వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే కారణంగా ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసు నేపథ్యంలో అప్పట్లో ఆయన అరెస్ట్ అవుతారనే ప్రచారం జరిగింది. అయితే, హైకోర్టును ఆశ్రయించిన ఆర్జీవీకి కోర్టు అరెస్ట్ నుండి రిలీఫ్ ఇచ్చింది.
తాజాగా కోర్టు, విచారణకు సహకరించాలని ఆదేశించడంతో పోలీసులు ఆయనకు నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో, రామ్ గోపాల్ వర్మ ఇవాళ ఉదయం విచారణకు హాజరవుతానని ముందుగా సమాచారం ఇచ్చి, ఒంగోలు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.

