ప్రముఖ నటుడు, ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాలుగు అంబులెన్స్‌లను అందించారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. సోనూ సూద్ గారి ఉదారతను సీఎం చంద్రబాబు అభినందించారు, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ ప్రభుత్వం ప్రయోజనకరమైన కార్యక్రమాలకు భాగస్వామిగా మారినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సోనూ సూద్ సేవా కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని ఆకాంక్షించారు.

