శ్రీ శ్రీ శ్రీ లింగమంతుల స్వామి దేవరపెట్టె మహాయాత్రలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గొల్లగట్టు జాతరలో భాగంగా చికటాయపాలెం గ్రామం నుండి దేవరపెట్టెను తరలించే మహాయాత్రలో పాల్గొనడం తనకి అనందనిచ్చిందని అన్నారు.

ఆ తరువాత తొర్రూరు పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పెద్దవంగర మండలంలోని LB తండా, BC తండా, చిన్నవంగర గ్రామాల నాయకులతో హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ బలోపేతం కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. నాయకత్వం పదవికి పరిమితం కాకుండా బాధ్యత అని గుర్తు చేస్తూ, ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజా సమస్యలను ప్రభుత్వ స్థాయికి తీసుకెళ్లేలా కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే గారి నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి కార్యకర్త పాటుపడాలని, ప్రజలతో సన్నిహితంగా ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయడం ద్వారా పార్టీపై నమ్మకాన్ని పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


