Thursday, July 30, 2026
23.7 C
Hyderabad

2025లో బంగారం ధరలు తగ్గే ఛాన్స్

ఆర్థిక సర్వే అంచనాలు ఇవే!
2025లో తగ్గుముఖం పట్టనున్న బంగారం ధరలు

కొన్ని రోజులుగా బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.84,700 వద్ద ట్రేడయ్యింది. గోల్డ్‌ కొనాలనే ఆలోచన చేయడానికే సామాన్యులు భయపడుతున్నారు. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2025లో బంగారం ధరలు తగ్గి, వెండి ధరలు కాస్త పెరిగే అవకాశం ఉందని 2024-25 ఆర్థిక సర్వే అంచనా వేసింది.
కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు జనవరి 31న పార్లమెంటులో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు. ఈ సర్వేకు మద్దతుగా ప్రపంచ బ్యాంకు అక్టోబర్ 2024 కమోడిటీ మార్కెట్ల అంచనాలను ఉదహరించారు. దీని ప్రకారం, కమోడిటీ ధరలు 2025లో 5.1%, 2026లో 1.7% వరకు తగ్గుతాయని అంచనా. ఆయిల్‌ ధరలు తగ్గనుండగా, నేచురల్‌ గ్యాస్‌ ధరలు పెరుగుతాయి. లోహాలు, వ్యవసాయ ముడి పదార్థాలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది.

2025లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని సర్వే తెలిపింది. విదేశీ మారక నిల్వలు మారడమే దీనికి ప్రధాన కారణమని ట్రేడ్ వర్గాల మాట. ఇక ప్రపంచ అనిశ్చితి కారణంగా చాలా సెంట్రల్ బ్యాంకులు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు బంగారాన్ని నిల్వ చేస్తున్నాయి. 2024లో బంగారు కడ్డీ నిల్వలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఈ డిమాండ్ బంగారం ధరలు పెరగడానికి దోహదపడింది. అయితే వచ్చే ఏడాది డిమాండ్ తగ్గుముఖం పట్టి ధరలు దిగివచ్చే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.

వెండి ధరలు మాత్రం పెరుగుతాయని సర్వే అంచనా వేసింది. పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్, మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా వెండి ధరలు పెరగవచ్చని నివేదిక సూచించింది. విలువైన లోహాలలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్న పెట్టుబడిదారులు 2025లో వెండిని ఆకర్షణీయమైన ఎంపికగా భావించవచ్చని పేర్కొంది.

బంగారం ధరలు తగ్గడం, వెండి ధరల పెరుగుదల భారతదేశ ఆర్థిక వ్యవస్థపై మిశ్రమ ప్రభావాలను చూపుతాయి. బంగారం ధరలు తగ్గితే వినియోగదారులకు, ముఖ్యంగా ఆభరణాలను కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఈ క్షీణత పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేయవచ్చు. అయితే వెండి ధరల పెరుగుదల బులియన్ మార్కెట్‌కు కొంత బ్యాలెన్స్‌ని తీసుకొస్తుందని సర్వే తెలిపింది. ద్రవ్యోల్బణం, వాణిజ్యం, విదేశీ మారక నిల్వలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, ఈ ధరల కదలికలను నిశితంగా పరిశీలించాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. వీటితోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పులు, యూఎస్‌ డాలర్ ఆధిపత్యం వంటివి కమోడిటీ ధరలను ప్రభావితం చేయవచ్చు.

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News