అమెరికాలోని వాషింగ్టన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రీగన్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ల్యాండింగ్ సమయంలో ప్రయాణికుల విమానం పోలీస్ హెలికాప్టర్‌ను ఢీకొని కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే రక్షణ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన అమెరికాలో విమానయాన భద్రతపై మరింత ఆందోళన రేకెత్తించింది.

