76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. దేశ రాజధాని న్యూ ఢిల్లీలో జరిగిన వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది మూర్మూ, అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పార్టీ కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షులు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండా ఆవిష్కరించి, ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగ ఫలం మన దేశమని, దేశాన్ని అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలుపడానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

