ఈ నెల 28న నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లో కాంగ్రెస్ పై వున్న వ్యతిరేకతతో పాటు తమ అభ్యంతరాలను వ్యక్తపరచేందుకు బీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. హైకోర్టు అనుమతి నేపథ్యంలో బిఆర్ఎస్ నాయకత్వం ధర్నా ఏర్పాట్లను వేగవంతం చేసింది. చట్టప్రకారం నిర్వాహకులు నిబంధనలను పాటించాలని కోర్టు సూచించింది. ర్యాలీకి రాజకీయ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పార్టీ పిలుపునిచ్చింది.

