తక్షణమే స్పందించి, ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే యశస్విని
రాయపర్తి మండలంలోని ఎక్యా తండా గ్రామంలో కరెంట్ షాక్ తో మృతి చెందిన ధరావత్ గోపి కుటుంబాన్ని పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి పరామర్శించి ఆర్థిక సహాయం అందించి, ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. మృతి చెందిన విషయం ఎమ్మెల్యే కి తెలిసిన వెంటనే మృతుడి గ్రామానికి చేరుకుని, మృతి దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే వారి కుటుంబానికి ఎలాంటి సహాయం అవసరమైనా అందజేయడానికి తనవంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు ఈ విషయంపై చర్యలు తీసుకొని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

