స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పెద్ద వంగర ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే యశస్విని, ఝాన్సీ రాజేందర్ రెడ్డి
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో గల క్యాంప్ కార్యాలయంలో పెద్దవంగర మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతిఒక్కరికీ అందేలా కృషి చేయాలని, ప్రజలలో పార్టీ బలం పెంచడం కోసం కార్యకర్తలందరూ క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు.
నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, పార్టీకి కష్టపడే కార్యకర్తలకు తగిన గౌరవం, గుర్తింపు ఉండేలా చూసుకుంటామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికలలో సమన్వయంతో పనిచేస్తూ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

