భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఇటీవల టీమిండియా ఆటగాళ్ల ప్రవర్తనపై కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఆటగాళ్ల పాత తప్పులు, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం, ప్రాక్టీస్ సెషన్స్‌ను ఎగ్గొట్టడం వంటి విషయాలు బోర్డు దృష్టికి వచ్చాయి. అందువల్ల, బీసీసీఐ కొత్త 10 పాయింట్ల గైడ్‌లైన్స్‌ను ప్రకటించింది, ఇవి ఆటగాళ్లకు షాక్ ఇచ్చాయి.
ఈ పాలసీ ప్రకారం, ఇకపై ప్రతి ఆటగాడు డొమెస్టిక్ టోర్నీల్లో కచ్చితంగా ఆడాలి. జట్టుతోనే ప్రయాణించాలి, కుటుంబంతో ప్రయాణం చేయాలంటే కోచ్ లేదా సెలెక్షన్ కమిటీ నుండి అనుమతి తీసుకోవాలి. అదనపు లగేజీ తీసుకెళ్లాలంటే ఆటగాళ్లు తమ సొంత ఖర్చుతో భరించాల్సి ఉంటుంది. వ్యక్తిగత స్టాఫ్‌ను బీసీసీఐ అనుమతి లేకుండా తీసుకెళ్లలేరు.
పట్టుదల, క్రమశిక్షణ ముఖ్యమైన అంశాలు కాగా, వ్యక్తిగత షూట్స్ లేదా ఎండార్స్‌మెంట్స్‌కు ఎలాంటి అనుమతి ఉండదు. విదేశీ పర్యటనలలో కుటుంబ సభ్యులను 45 రోజులకంటే ఎక్కువ గల టూర్లలో మాత్రమే అనుమతిస్తారు. కొత్త పాలసీ ప్రకారం, ఆటగాళ్లు జట్టులో ఐక్యతగా ఉండి, మంచి ఫలితాలను సాధించాలని బీసీసీఐ స్పష్టం చేసింది.

