ఆజాం జహీ మిల్లు కార్మిక భవన స్థలాన్ని కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తూ… పోస్టు కార్డుల ఉద్యమాన్ని ఆజమ్ జాహి కార్మిక భవన స్థల పరిరక్షణ కమిటీ వేదికపై ఐక్య వేదిక గురువారం ప్రారంభించింది. ఈ ఉద్యమానికి మద్దతుగా అజం జాహి మిల్లు కార్మికుడి కుటుంబ సభ్యులు, ప్రముఖ రచయిత ఐక్య వేదిక కన్వీనర్ రామా చంద్రమౌళి మొదటి పోస్టు కార్డు రాసి ప్రారంభించారు. వారి తరువాత మాజీ మేయర్ డాక్టర్ తక్కెళ్లపల్లి రాజేశ్వర్ రావు కూడా సీఎం కు కార్మిక భవన స్థలాన్ని పరిరక్షించాలని కోరుతూ…. పోస్టు కార్డు రాశారు.

