సంక్రాంతి పండుగ సందర్భంగా హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఈనెల 15, 16 తేదీలలో పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మహిళల కోసం ఆరు మండలాల కేంద్రాల్లో మండల స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈనెల 15వ తేదీన తొర్రూరు మండల కేంద్రంలో గల జెడ్పి ఉన్నత పాఠశాల, పెద్ద వంగర మండల కేంద్రంలో జెడ్పి ఉన్నత పాఠశాల, రాయపర్తి మండల కేంద్రంలో జడ్పీ ఉన్నత పాఠశాల, కొడకండ్ల మండల కేంద్రంలో జెడ్పి ఉన్నత పాఠశాల, దేవరుప్పుల మండల కేంద్రంలో జెడ్పి ఉన్నత పాఠశాల, 16వ తేదీన పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో పాలకుర్తి పంచ గుళ్ళు (కోనేరు ముందు) గల ఖాళీ స్థలం లో ఉదయం ఎనిమిది గంటలకు ముగ్గుల పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళలు వారి మండల కేంద్రాల్లో జరిగే ఈ పోటీలకు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

