తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ అందరికి ఆనందం, శాంతి, సమృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని రైతులు, వ్యవసాయ కూలీలు, నిరుపేద కుటుంబాలకు ఈ పండుగ కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికీ చేరేలా తన ప్రయత్నం కొనసాగుతుందని తెలిపారు. తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రజలందరూ సంక్రాంతి పండుగను ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకోవాలని కోరారు.

