Thursday, July 30, 2026
23.4 C
Hyderabad

ఏసీబీ టెక్నా’లాజిక్ ట్రాప్.

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ సర్కిల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అవినీతి కేసును ఛేదించిన సంఘటన సంచలనంగా మారింది. తొర్రూర్ సీఐ కర్రి జగదీష్ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై విశ్వసనీయ సమాచారం మేరకు, గత సంవత్సరం అక్టోబర్ నెలలో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి పోలీసులు పీడీఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్న ఓ లారీని పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుల వెతకడంలో తొర్రూర్ సీఐ జగదీష్ కూడా వున్నారు.

అవినీతి ఒప్పందం
ఈ కేసులో దర్యాప్తు సందర్భంగా, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ వ్యాపారి పేరు బయటకు రావడంతో అతన్ని విచారణకు పిలిపించారు. అయితే, సీఐ జగదీష్ ఈ విచారణను లంచం కోసం ఉపయోగించుకున్నాడు. వ్యాపారిపై ఒత్తిడి తెచ్చి, తనకు రూ. 5 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరకు రూ. 4 లక్షల ఒప్పందం కుదుర్చుకుని, మొదటి విడతగా రూ. 2 లక్షలు తీసుకున్నాడు. మిగిలిన రూ. 2 లక్షల కోసం పలు మార్లు వ్యాపారిని ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు.

వాట్సప్ కాల్
సీఐ రెగ్యులర్ కాల్ చేస్తే CDR (కాల్ డేటా రికార్డు) ద్వారా తేలిపోతుందని భావించి, వాట్సప్ కాల్ ద్వారా డబ్బుల గురించి చర్చించాడు. అయితే, ఈ కాల్‌లను సదరు వ్యాపారి మరో మొబైల్ ద్వారా రికార్డు చేసి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సీఐ జగదీష్ అవినీతిని నిరూపించేందుకు ఏసీబీ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించింది. సీఐ, వ్యాపారికి మధ్య జరిగిన వాట్సప్ సంభాషణను ఏసీబీ ప్రత్యేక డివైజ్ సహాయంతో రికార్డు చేసింది. సీఐ వాట్సప్‌లోనే మాట్లాడుతున్నానన్న ధీమాతో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో, ఏసీబీకి తగిన ఆధారాలు దొరికాయి.

ఏసీబీ దాడులు
ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు, సోమవారం తొర్రూర్ సీఐ కార్యాలయంపై దాడులు నిర్వహించి జగదీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీఐ, తనను అవినీతి ఆరోపణలతో ఎలా అరెస్ట్ చేస్తారని ఎదురు ప్రశ్నించినా, ఏసీబీ అధికారులు తనకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలను చూపించారు. చివరికి సీఐ జగదీష్ తాను లంచం తీసుకున్న విషయాన్ని అంగీకరించాడు.

టెక్నాలజీపై ఆధారపడిన ఏసీబీ
అవినీతిని నివారించేందుకు మాత్రమే కాకుండా, దోషులను పట్టుకోవడంలో కూడా ఏసీబీ ఆధునిక టెక్నాలజీపై నమ్మకం ఉంచుతోంది. రెగ్యులర్ కాల్‌ల ద్వారా లంచం అడిగితే తాము దొరికిపోతామన్న అవినీతి అధికారులు, వాట్సప్ కాల్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడుతున్నారు. అయితే, ఏసీబీ ఆధునిక పద్ధతులను ఉపయోగించి, టెక్నాలజీ ట్రాప్ ద్వారా దోషులను పట్టుకోవడంలో విజయవంతమవుతోంది.

ఏసిబి అధికారుల స్పందన
ఈ ఘటన అధికార యంత్రాంగంలో అవినీతిని బయటపెట్టడంలో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది. ఏసీబీ అధికారులు చెప్పిన ప్రకారం, అవినీతి కేసులలో ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ఎలాంటి ప్రలోభాలకు పాల్పడినా, న్యాయానికి ఎసరు పెట్టినా వారిని కఠిన చర్యలు తీసుకుని శిక్షిస్తామన్నారు.

సీఐ అరెస్ట్

సీఐ జగదీష్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు, వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచేందుకు సిద్ధమయ్యారు. ఈ కేసు ద్వారా అవినీతికి పాల్పడుతున్న అధికారులకు గుణపాఠం చెప్పినట్టు మారింది. టెక్నాలజీ ద్వారా అవినీతి మీద పట్టు సాధించిన ఏసీబీ చర్యలు ప్రజలలో న్యాయంపై విశ్వాసం కలిగించింది .

Latest News

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News