చైనా మాంజా విక్రయించడాన్ని, వినియోగించడాన్ని కఠినంగా నిషేధించామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. పాతబస్తీలో పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో రూ.13 లక్షల విలువైన నిషేధిత మాంజాను స్వాధీనం చేసుకున్నారు. చైనా మాంజా వల్ల పర్యావరణానికి, పక్షులకు, మనుషులకు తీవ్రమైన హానీ జరుగుతుందని పోలీసులు తెలిపారు. చట్టానికి విరుద్ధంగా చైనా మాంజా విక్రయిస్తే ఐదేళ్ల జైలుశిక్ష ఎదురవుతుందని స్పష్టంగా హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో గాలిపటాలు ఎగురవేసే వ్యక్తులు చైనా మాంజా వినియోగించకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

