యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ క్లూజివ్ పరిశ్రమలో ఘోర పేలుడు జరిగింది. ఈ ఘటనలో జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన కార్మికుడు కనకయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన మొగిలిపాక ప్రకాష్ పరిస్థితి విషమంగా ఉండటంతో, భువనగిరి ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పరిశ్రమ వద్ద భయానక వాతావరణం నెలకొంది.

