తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్‌లో వరుస ఆత్మహత్యల ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఆదివారం మెదక్ జిల్లా కొల్చారం మండల పోలీస్ స్టేషన్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ సాయికుమార్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే కారణమని అనుమానిస్తున్నారు. అలాగే, సిద్ధిపేటలో ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ తన కుటుంబ సభ్యులకు విషం ఇచ్చి, అనంతరం ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో బాలకృష్ణ మరణించగా, అతని భార్య, పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. వరుస ఘటనలతో డిపార్ట్మెంట్‌లో ఉద్రిక్తత నెలకొంది. కేసులు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

