రేషన్ బియ్యం వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, పేర్ని నానిపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తనపై పెట్టిన కేసుల గురించి గుర్తు చేస్తూ, “పేర్ని నానికేనా పిల్లలు, మాకు లేరా?” అంటూ ప్రశ్నించారు. నాని మంత్రిగా ఉన్నప్పుడు ఆడవాళ్లపై ఏదైనా సమస్యలు గుర్తుకు రాలేదా అని నిలదీశారు.
పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల విషయాన్ని ప్రస్తావిస్తూ, “పవన్ విడాకులు తీసుకుని పెళ్లిళ్లు చేసుకుంటారు. ఆయన మంచోడు కాబట్టి ఊరుకున్నారు. కానీ మీరు అవమానించేలా ప్రవర్తించడం ఏమిటి?” అంటూ సూటి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును దూషించిన సందర్భాలను గుర్తుచేసి, “భువనేశ్వరి గురించి అసెంబ్లీలో ఎన్నో మాటలు అన్నారని, చంద్రబాబు మమ్మల్ని ఆపకపోతే మీకే తాట తీయడం తప్పేది కాదు,” అని తెలిపారు.
పేర్ని నాని కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసిన జేసీ ప్రభాకర్, “మీ ఆడవాళ్ల గురించి మాట్లాడితే చాలా ఉంది. కానీ సభ్యత కారణంగా మాట్లాడటం లేదు,” అంటూ కఠినంగా స్పందించారు. ఇదే సమయంలో పేర్ని నానిపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తీవ్ర సెటైర్లు వేశారు.

