తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్‌లో అద్భుత విజయం సాధించింది. టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన హంపి, 2019 తర్వాత మరోసారి ర్యాపిడ్ ఛాంపియన్గా అవతరించింది. చైనా గ్రాండ్ మాస్టర్ జు వెంజున్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా హంపి నిలిచింది. మరో తెలుగు గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంలో నిలిచింది. పురుషుల విభాగంలో, భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ తిరిగేసి తొమ్మిది రౌండ్ల తర్వాత వెనుకపడటంతో రష్యా యువ గ్రాండ్ మాస్టర్ వోలాదర్ ముర్జిన్ 10 పాయింట్లతో విజేతగా నిలిచాడు. అర్జున్ 9 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.

