పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ సినిమా పై మేకర్స్ కీలక ప్రకటన చేశారు. “మా ‘ఓజీ’ సినిమాకు చూపిస్తున్న ప్రేక్షకుల ప్రేమ, అభిమానం పొందడం మా అదృష్టం. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా, ‘ఓజీ’ అని గట్టిగా అరచి ఆయనకు ఇబ్బంది కలిగించవద్దు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఆయనను, ఆయన స్థాయిని గౌరవించాలని కోరుకుంటున్నాం. ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టండి. ‘ఓజీ’ సినిమా పండుగ వైభవంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది,” అంటూ ఓజి మేకర్స్ పేర్కొన్నారు.

