విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతోంది. ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్ హిట్‌గా మారాయి. మొదటి సింగల్ ‘గోదారి గట్టు మీద’ గ్లోబల్ టాప్ 20 వీడియోస్ లో చోటు సంపాదించగా, రెండవ సింగల్ ‘మీను’ అన్ని మ్యూజిక్ చార్ట్లలో అగ్రస్థానంలో నిలిచింది.
ఇప్పుడు మేకర్స్ థర్డ్ సింగల్ – బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ గురించి ప్రకటించారు. ఈ పాట అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో హీరో వెంకటేష్, హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కలర్ ఫుల్, సిగ్నేచర్ డ్యాన్స్ మూమెంట్స్‌తో కనిపిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ పాట కోసం సంక్రాంతి ఫెస్టివల్ వైబ్‌ను హైలైట్ చేసే మ్యూజిక్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ ప్రధాన ఆకర్షణగా విక్టరీ వెంకటేష్ స్వయంగా పాట పాడటం ఉందని తెలుస్తోంది. ఎనర్జిటిక్, కలర్‌ఫుల్ నంబర్ కోసం భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తారు.
ఈ చిత్రం విక్టరీ వెంకటేష్ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, ఐశ్వర్య రాజేష్ ఆయన భార్యగా, మీనాక్షి చౌదరి అతని ఎక్స్-లవర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శిరీష్ నిర్మిస్తున్నారు, దిల్ రాజు సమర్పిస్తున్నారు. చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ప్రధాన పాత్రల్లో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా, జనవరి 14న విడుదల కానుంది.

