జిల్లాలో తన మార్క్ చూపిస్తున్న జిల్లా కలెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు వచ్చినప్పటినుండి తనదైన శైలిలో పనిచేస్తూ…. జిల్లా యంత్రాంగానికి చుక్కలు చూపిస్తున్నారు. అందులో భాగంగా యాదగిరిగుట్ట అంగన్ వాడి సెంటర్ 3, పుట్టగూడెం, మంతపురి ,మోత్కుర్ సెంటర్ 7 అంగన్వాడి సెంటర్లలో బాలామృతాన్ని పక్కదారి పట్టించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు సీరియస్ గా తీసుకుని, విచారణ చేయగా తప్పు జరిగిందని తేలడంతో ఆయా అంగన్వాడి సెంటర్ల టీచర్లను సస్పెండ్ చేశారు. నీతి నిజాయితీగా జిల్లా కలెక్టర్ పనిచేస్తున్నారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

