Sunday, September 13, 2026
29.2 C
Hyderabad

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి!
రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ…
అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ, అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ)తో తయారు చేసిన వినాయక విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవుతున్న నేపథ్యంలో, పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని అడుగు డిజిటల్ మీడియా ప్రజలను కోరింది. ఇందులో భాగంగా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో శివసాయి కిరాణం అండ్ జనరల్ స్టోర్స్ అధినేత చారగొండ్ల రవి కుమార్ సహకారంతో అడుగు డిజిటల్ మీడియా, మార్గం ఫౌండేషన్, స్టూడెంట్ ఫర్ సేవ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అడుగు డిజిటల్ మీడియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆయా సంస్థల చైర్మన్ మార్గం సాయి సందేశ్ తేజ సభాధ్యక్షత వహించగా, అడుగు డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీ నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలకుర్తి గ్రామ ఉప సర్పంచ్ గాదెపాక కిరణ్, వార్డు సభ్యులు కామారపు సునీల్, కమ్మగాని సుధాకర్, కమ్మగాని శ్రీకాంత్, డీవీఆర్ శర్మ, దేవగిరి అనిల్ కుమార్ శర్మ, మత్తగజం నాగరాజు శర్మ, గంగు నవీన్ శర్మ, దేవగిరి సంతోష్ శర్మ, దేవగిరి శ్యామ్ శర్మ, గంగు శ్రావణ్ కుమార్, గంగు రఘు శర్మ, పాలకుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గూడూరు లెనిన్, గణేష్ ఉత్సవ సమితి నాయకులు దొంగరి మహేందర్ తదితర ఆత్మీయులు పాల్గొని ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రజలకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, రసాయనాలు లేని మట్టి వినాయక విగ్రహాలు నీటిలో సులభంగా కలిసిపోయి పర్యావరణానికి మేలు చేస్తాయని అన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు మట్టి వినాయకుల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు చిన్ననాటి నుంచే పిల్లల్లో పర్యావరణహిత ఆలోచనలు, ఆచారాలను పెంపొందించాలని సూచించారు. భక్తి భావన ప్రకృతికి హాని కలిగించేదిగా ఉండకూడదని, మట్టి గణపతిని పూజించడం ద్వారా భక్తితో పాటు ప్రకృతి మాతకు కూడా మేలు చేసినవారమవుతామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అడుగు డిజిటల్ మీడియా చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో అడుగు చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీ నారాయణ కుటుంబం ముందుండటం ప్రశంసనీయమని అన్నారు. అదే విధంగా ప్రతి సేవా కార్యక్రమానికి సహకరిస్తున్న చారగొండ్ల రవి కుమార్ కుటుంబాన్ని కూడా అభినందించారు. మట్టి వినాయకుల వినియోగం ద్వారా భక్తిని, సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను ప్రతి ఒక్కరూ స్వీకరించాలని వారు కోరారు.

అనంతరం అడుగు డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ మట్టి వినాయకుల వినియోగం వల్ల కలిగే పర్యావరణ ప్రయోజనాలను వివరించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నీటిలో సులభంగా కరగకపోవడంతో పాటు వాటికి ఉపయోగించే రంగులు, రసాయనాల వల్ల చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా తమ బృందం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణహిత ఆలోచనలు చేయాలని, మట్టి గణపతిని మహా గణపతిగా భావించి భక్తిశ్రద్ధలతో పూజించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సహకరించిన చారగొండ్ల రవి కుమార్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని ఆలోచించి, సమన్వయం చేసి విజయవంతం చేసిన అడుగు డిజిటల్ మీడియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గం సాయి సందేశ్ తేజను అభినందించారు.

ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు చిట్యాల యాకయ్య, మారం రవి కుమార్, దేవరాజు, అశోక్ మహర్షి, సాహిత్ శర్మ, రాపోలు రాంబాబు, బోనగిరి యాకస్వామి, ఇమ్మడి వీరన్న, రాపాక దయాకర్, ఉమాకర్, పునీత్ కుమార్, గాదెపాక రమేష్, పోతనరావు, సత్యనారాయణ, అశోక్, మణికంఠ, సోమన్న, మార్గం సారంగపాణి, అనంతుల సోమేశ్వర్, వైట్ల శ్రీహరి, మార్కండేయ, పెద్దూరి సోమన్న తదితరులు పాల్గొన్నారు.

Latest News

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

సెప్టెంబర్ 11,శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి అమావాస్య ఉదయం 08.35 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పుబ్బ పగలు 02.08 వరకు ఉపరి ఉత్తర యోగం సాధ్య రాత్రి 06.54 వరకు ఉపరి శుభ కరణం నాగవ ఉదయం 08.35 వరకు ఉపరి కింస్తుంఘ్న రాహుకాలం...

గీ సర్, గా అన్నదమ్ముల్ని కలిపింది!?|ADUGU TRENDS

అవుమల్ల.. గది నిజమేనుల్లా... పత్యేక ఓట్ల సవరింపు (సర్) 35 ఏండ్ల కింద యిడిపోయిన అన్నదమ్ముల్ని కలిపింది. గదెట్లనో మీరే సదువుండ్రి. మన తెలంగాణ లెక్కనే గా పంజాబ్ ల సర్ సవరింపులు జరుగుతున్నయి....

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ఎప్పుడో!?|EDITORIAL

ట్రంప్–పుతిన్ చర్చలుగానీ, మోదీ–పుతిన్ భేటీగానీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకలేవు. కాల్పుల విరమణకు ముందుగా పరస్పర విశ్వాసం, భద్రతా హామీలు, భూభాగ వివాదంపై ఆచరణీయ పరిష్కారం, అంతర్జాతీయ పర్యవేక్షణ వంటి అంశాలపై స్పష్టమైన...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News