Sunday, September 13, 2026
29.2 C
Hyderabad

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం యొక్క ముఖ్య అధికారిని విషయపతి అనేవారు. గ్రామ పాలనను నిర్వహించడానికి గ్రామణి అనే అధికారి ఉండేవాడు. నగర పాలనను వ్యాపారం చేసే వారితో కూడిన నిగమ సభలు (మున్సిపల్ కౌన్సిల్) నిర్వహించేది.

ముఖ్యమైన అధికారులు : ఈ కాలంలో ముక్యమైన అధికార గణాన్ని కింది విధంగా పిలిచేవారు.
కుమారమాత్య – ఉన్నత అధికారులు
మహాబలాధీకృత – సేనాపతి
మహాదండనాయక – ముఖ్య న్యాయమూర్తి
అఖపాలాధికృత – కోశాధికారి
హిరణిక – పన్నులు వసూలు చేసే అధికారి
సంధి విగ్రాహాక – విదేశాంగ శాఖ (వేరే రాజ్యాలతో సంధి కుదుర్చుకొనుటకు)
భటాశ్వపతి – అశ్వ దళాధిపతి
దండ పాషాధికారణ – పోలీస్ శాఖాధిపతి (నగర కొత్వాల్)

గుప్తుల కాలం నాటి మత పరిస్థితులు

గుప్తుల కాలంలో అనూహ్యమైన మత పరిస్థితులు చోటుచేసుకొని హిందూ మతం పూర్తి రూప సంతరించుకుంది. భక్తియే ప్రధాన అంశంగా భారతదేశంలోని ప్రాచీన కాలంలో ఉన్న మతాలన్నింటినీ సర్వ సమ్మేళనం చేసి ఒక కొత్త మతంగా అవతరించింది. దీనినే ప్రస్తుతం మనం హిందూ మతంగా అనుసరిస్తున్నాము. ఇందులో వైష్ణవం మరియు శైవం అనే రెండు ప్రధాన శాఖలు పుట్టుకొచ్చాయి. (హిందూ మతం మతం కాదు. ఇది ఒక జీవన విధానం. ఎందుకంటే సహజసిద్ధంగా మత ఆవిర్భావం జరిగింది. ఇందులో ద్రావిడులు, ఆర్యులు, యజ్ఞయాగాలు, భక్తి, విష్ణువు, శివుడు, కృష్ణుడు, ప్రకృతి దేవతలు, గిరిజన దేవతలు మొదలగ్గునవన్నీ మిళితమై ఉంటాయి. హిందూ మతానికి స్థాపకుడు, కాలం, సిద్ధాంతాలు, ఏకపవిత్రగ్రంథం, ఇక దైవం అనేవి లేవు మరియు ఉండవు.)

వైష్ణవము

విష్ణువు ధర్మాన్ని స్థాపించడానికి దశావతారాలుగా అవతరించాడని గుప్తుల కాలంలోనే ప్రజల్లో విశ్వాసం బలపడింది.
దశావతారాలు – మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, కల్కి అవతారం.

శైవము

హిందూ మతంలో మరొక ప్రధాన శాఖ శైవము. ప్రాచీన కాలంలోనే శైవ శాఖలో అనేక ఉపశాఖలు ఆవిర్భవించాయి. అందులో పాశుపథము, కాపాలిక, అఘోరశైవము, మితవాద శైవము మొదలగునవి. (అఘోర శైవంలో నేటికీ కాశీ ప్రాంతంలో అఘోరాలు నివసిస్తున్నారు. వీరు అతివాద వర్గానికి చెందినవారు. మలమూత్రాలు, శవాలు మరియు కుళ్ళిన కళేబరాలను తింటారు.)

గుప్తుల కాలంనాటి కళలు

గుప్తుల కాలాన్ని పండితులు మరియు చరిత్రకారులు స్వర్ణయుగంగా అభివర్ణించారు. ఈ కాలంలోనే లలితకళలు మరియు సాహిత్యము అత్యున్నత ప్రగతి సాధించడం వల్ల దీనిని స్వర్ణయుగంగా పిలుస్తున్నారు. కానీ ప్రస్తుత చరిత్రకారులు ఈ వాదనతో ఏకీభవించడంలేదు. ఎందుకనగా సమాజంలో మరియు మానవ జీవన విధానంలో ప్రగతిని సాధిస్తే మాత్రమే స్వర్ణయుగంగా పిలవాలని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కాలంలో సాహిత్యం అత్యున్నత శిఖరాలకు చేరుకోవడం వల్ల సాంస్కృతిక యుగమని చెప్పవచ్చు.

వాస్తుశిల్పకళ

వీరు బౌద్ధ శిల్పకళను మరియు హిందూ శిల్పకళను సమానంగా ఆదరించారు. గుప్తులు వైష్ణవులైనప్పటికీ ఇతర అన్ని మతాలను సమానంగా ఆదరించి తమ యొక్క లోకైక భావాలను ప్రజలకు మరియు సమాజానికి వ్యక్తపరిచారు. గుప్తుల కాలంలో సారనాథ్(కాశీ నగర సమీపం)లోని బుద్ధుడి విగ్రహం ప్రముఖమైనది. గౌతమ బుద్ధుడు ధర్మచక్రంపరివర్తన (గౌతమబుద్ధుడు తన తొలి బోధనను చెప్పడం. దీనికి అయిదుగురు శిష్యులు హాజరయ్యారు.) చూపించే శిల్పాలి సారనాధ్ శైలిలో ప్రముఖమైనది కాబట్టి సారనాథ్ ను బౌద్ధ మత జన్మస్థలంగా చెప్తారు. దీనితోపాటు ప్రస్తుత బీహార్ లోని సుల్తాన్ గంజ్ లో ఉన్న ఏడున్నర అడుగుల ఎత్తైన రాగి బుద్ధుని శిల్పం గుప్తుల కాలానికి చెందినదే. వీరు అనేక బౌద్ధ గుహాలయాలను నిర్మించారు. వీటిలో కొన్ని విహారాలు (బౌద్ధ సన్యాసులు నివసించే గుహలు) మరియు చైత్యాలు (బౌద్ధుల ప్రార్థనా మందిరాలు) ఉన్నాయి.

గుప్తులు బౌద్ధ శిల్పకళతో పాటు హిందూ శిల్పకళను అభివృద్దిచేసారు. భారతదేశంలో నేటికీ నిలిచియున్న హిందూ దేవాలయాలు గుప్తులవే. ఇందులో శైవ మరియు వైష్ణవ దేవాలయాలున్నాయి. మధ్యప్రదేశ్ లో ఉన్న సుమారు 20 గుహాలయాల్లో అయిదవ దానిలో భూమిని కాపాడుతున్న వరాహ శిల్పం అత్యంత సుప్రసిద్ధమైనది. దీనితోపాటు ఉజ్జయినిలో (మధ్యప్రదేశ్) వీరు అనేక ఆలయాలను నిర్మించారు కాబట్టే గుప్తులకు ఉజ్జయిని సాంస్కృతిక మరియు సాహిత్య రాజధానిగా (రెండవ రాజధాని) కొనసాగింది.

అజంత శిల్పకళ

ప్రస్తుత మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా సహ్యాద్రి పర్వతశ్రేణుల్లో బౌద్ధ మతానికి చెందిన శిల్పం మరియు చిత్రలేఖనం ఉన్నాయి. ఇది భారతదేశంలో UNESCO గుర్తించిన తొలి ప్రపంచ వారసత్వ కేంద్రం. ఇక్కడ సుమారు 30 బౌద్ధ గుహాలయాలు గుర్తించబడ్డాయి. ఇందులో కొన్ని విహారాలు, మరికొన్ని చైత్యాలు ఉన్నాయి. పాళీ భాషలో రాయబడిన బుద్ధుని జాతకాలు మరియు బోధిసత్వుల కథలను గోడల మీద చెక్కి అలంకరించారు. బుద్ధుని జీవితంలోని ప్రధాన ఘట్టాలైన వజ్రపాణి, పద్మపాణి చిత్రాలు సుప్రసిద్ధమైనవి.

Latest News

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

సెప్టెంబర్ 11,శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి అమావాస్య ఉదయం 08.35 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పుబ్బ పగలు 02.08 వరకు ఉపరి ఉత్తర యోగం సాధ్య రాత్రి 06.54 వరకు ఉపరి శుభ కరణం నాగవ ఉదయం 08.35 వరకు ఉపరి కింస్తుంఘ్న రాహుకాలం...

గీ సర్, గా అన్నదమ్ముల్ని కలిపింది!?|ADUGU TRENDS

అవుమల్ల.. గది నిజమేనుల్లా... పత్యేక ఓట్ల సవరింపు (సర్) 35 ఏండ్ల కింద యిడిపోయిన అన్నదమ్ముల్ని కలిపింది. గదెట్లనో మీరే సదువుండ్రి. మన తెలంగాణ లెక్కనే గా పంజాబ్ ల సర్ సవరింపులు జరుగుతున్నయి....

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ఎప్పుడో!?|EDITORIAL

ట్రంప్–పుతిన్ చర్చలుగానీ, మోదీ–పుతిన్ భేటీగానీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకలేవు. కాల్పుల విరమణకు ముందుగా పరస్పర విశ్వాసం, భద్రతా హామీలు, భూభాగ వివాదంపై ఆచరణీయ పరిష్కారం, అంతర్జాతీయ పర్యవేక్షణ వంటి అంశాలపై స్పష్టమైన...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News