Wednesday, July 29, 2026
23.3 C
Hyderabad

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా వీరికి ఆర్యులు అనే పేరు వచ్చింది. వీరు రచించిన వేద సాహిత్యం ద్వారా సాహిత్యమును అధ్యయనం చేశారు కాబట్టి వీరిని వైదికులు అంటారు. భారతదేశంలో సాహిత్యం ద్వారా అధ్యయనం చేయబడిన తొలి యుగం ఇదే. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ నాగరికతను Painted Grey Ware (కుండ పాత్రలు) అంటారు.

ఆర్యుల జన్మస్థలం:

ఆర్యుల జన్మస్థలం గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సాహిత్యంలో వీరి జన్మస్థలం గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. కొంతమంది చరిత్రకారులు వీరిని స్వదేశీయులు అని మరికొందరు విదేశీయులని అంటున్నారు.

D.S. త్రివేది, సంపూర్ణానంద్ ప్రకారం ఆర్యులు స్వదేశీయులని సింధు ప్రాంతం వీరి జన్మస్థలమని భావిస్తున్నారు.

దయానంద సరస్వతి ప్రకారం ఆర్యులు టిబెట్ ప్రాంతం నుండి వలస వచ్చారని అభిప్రాయపడుతున్నారు.

జర్మన్ శాస్త్రవేత్త అయిన మాక్స్ ముల్లర్ ప్రకారం ఆర్యులు మధ్య ఆసియా నుండి భారతదేశానికి వచ్చి క్రీ. పూ.1500 కాలంలో సింధు ప్రాంతంలో స్థిరపడ్డారని భోగజ్ కోయీ శాసనం తెలియచేస్తుంది. ప్రస్తుతానికి ఈ మాక్స్ ముల్లర్ అభిప్రాయాన్ని ఎక్కువ మంది పండితులు ఆమోదిస్తున్నారు. ఆర్యుల నాగరికతను సౌలభ్యం కొరకు రెండు భాగాలుగా విభజించి అధ్యయనం చేస్తారు.

ఎ) మొదటి దశ: ఈ కాలాన్ని ఋగ్వేద యుగమని పిలుస్తారు. ఎందుకంటే ఈ కాలాన్ని అధ్యయనం చేయడానికి ఋగ్వేదం ఒకటే ఆధారం. దీని కాలం క్రీ. పూ. 1500 నుండి 900 వరకు.

బి) రెండవ దశ: ఈ కాలాన్ని మలివేద యుగం అంటారు. దీని కాలం క్రీ. పూ. 900-500 వరకు.

ఆర్యుల భౌగోళిక పరిజ్ఞానం:

ఆర్యులు తొలివేద కాలంలో కేవలం సింధు ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యారు. తూర్పున యమున, దక్షిణాన ఆరావళి ప్రాంతం వరకు మాత్రమే వీరు జీవించారు. ఈ కాలం ఆర్యులకు సముద్రం తెలియదు. సముద్రం అంటే కేవలం నదుల సంగమం అని మాత్రమే తెలుసు. ఋగ్వేద కాలంనాటి ఆర్యులకు సింధు నాగరికత వెలసిన ప్రాంతాల్లోనే జీవించారు. క్రీ. పూ. 1000 కాలంలో ఆర్యులు సింధు ప్రాంతం నుండి గంగా మైదాన ప్రాంతానికి వలస వెళ్ళారు. శతపద బ్రాహ్మణం సింధు ప్రాంతంలోని ఒక తెగ నాయకుడు తన తెగతో కలిసి గంగా నది పరివాహక ప్రాంతాల్లో స్థిరపడ్డారని చెప్తుంది. మలివేద ఆర్యులకు భారతదేశంలోని అన్ని ప్రాంతాల మీద అవగాహన ఉంది అని ఐతరేయ బ్రాహ్మణం తెలియచేస్తుంది.

వేద సాహిత్యం

ఆర్యులు అందించిన అద్భుతమైన సాహిత్యం వేదసాహిత్యం. ఇది సంస్కృత భాషలో ప్రారంభంలో మౌఖికంగా ఉంటూ గుప్తుల కాలంలో రాయబడింది. ఆర్యులు అందించిన ఈ వేదసాహిత్యమే హిందూ మతానికి పవిత్ర గ్రంథాలుగా మారాయి. వేద సాహిత్యంలో ప్రధానంగా 8 భాగాలున్నాయి. అవి:
1. వేదాలు
2. బ్రాహ్మణాలు
3. అరణ్యకాలు
4. ఉపనిషత్తులు
5. వేదాంగాలు
6. పురాణాలు
7. ఉపవేదాలు
8. ఇతిహాసాలు
ఇందులో మొదటి నాలుగింటిని శృతి సాహిత్యం అంటారు. శృతి అనగా పాడగలిగేవి అని అర్థం. ఇవి దేవతలు రాసి ఋషులకు పంపించారని నమ్మకం. ఇవి అత్యంత పవిత్రమైన గ్రంథాలు.
చివరి నాలుగింటిని స్మృతి సాహిత్యం అంటారు. ఇవి ఋషులు రాయబడిన గ్రంథాలు.

వేదాలు

వేదాలు నాలుగు. అవి:
1) ఋగ్వేదం: ఇందులో 1028 శ్లోకాలుంటాయి. ఇవన్నీ వివిధ దేవతలకు ప్రార్థనలు. వీటిలో అత్యంత ముఖ్యమైనది గాయత్రి మంత్రం సావిత్రి అనే దేవతకు ప్రార్థన. ఋగ్వేదంలోని పది మండలాలలో చివరిది పురుషసూక్తం. తొలిసారిగా కుల ప్రస్తావన ఈ పురుషసుక్తంలోనే ఉంది. సృష్టికర్త అయిన బ్రహ్మ కుల వ్యవస్థను మరియు సమస్త విశ్వమును తన శరీరం నుండే సృష్టించాడని ఈ గ్రంథం చెప్తుంది. తల నుండి బ్రాహ్మణులను, భుజాల నుండి క్షత్రియులను, తొడల నుండి వైశ్యులను, పాదాల నుండి శూద్రులను పుట్టించాడని ఈ గ్రంథం తెలియచేస్తుంది.

2) యజుర్వేదం: ఈ వేదం యజ్ఞయాగాల గురించి తెలియజేస్తుంది. ఆర్యుల కాలంలో యజ్ఞయాగాలు కీలక పాత్రను పోషించాయి.

3) సామవేదం: సమ అంటే సంగీతం అని అర్థం. ఋగ్వేదంలో రాయబడిన శ్లోకాలను రాగయుక్తంగా సామవేదంలో ఆలకించారు. ఇందులో కొత్త సమాచారం ఏమీ ఉండదు.

4) అథర్వణ వేదం: ఈ వేదం 20 ఖండాలుగా విభజించబడి సుమారు ఏడు వందల శ్లోకాలను కలిగిఉంది. ఇందులో భూతప్రేతాలను, రోగాలను నివారించే మంత్రాలు ఉంటాయి. ఇవి. ఆర్యుల కాలంలో కూడా మూఢనమ్మకాలు ఉండేవి అని సూచిస్తుంది. కొంతమంది పండితుల ప్రకారం అథర్వణ వేదాన్ని ఆర్యులు కాకుండా ఇతర జాతి ప్రజలు రచించారని చెప్తున్నారు. వేదాల్లో గల మొదటి మూడు వేదాలను త్రయం అని, వీటిని పూర్తిగా ఆర్యులే రచించారని చెప్తున్నారు.

బ్రాహ్మణాలు

ఇవి యజ్ఞయాగాల గురించి తెలియజేసే గ్రంథాలు. ఇందులో ఏడు బ్రాహ్మణాలు గద్యరూపంలో వేదాలకు అనుబంధంగా రాయబడ్డాయి. అవి: 1) ఐతరేయ బ్రాహ్మణం, 2) కౌశితకి బ్రాహ్మణం, 3) శతపత బ్రాహ్మణం, 4) తైత్తిరీయ బ్రాహ్మణం, 5) తాండ్యమాన బ్రాహ్మణం, 6) తైమీనియ బ్రాహ్మణం, 7) గోపథ బ్రాహ్మణం.

ఐతరేయ బ్రాహ్మణం కళింగ, పులింద, ఆంధ్ర ఇత్యాది, సవర వంటి తెగలు దక్షిణ భారతదేశంలో జీవిస్తున్నాయి తెలియజేసింది. ఆంధ్ర అనే పదం తొలిసారిగా ఈ గ్రంథాలోనే ప్రస్తావించబడింది.

అరణ్యకాలు

అడవులలో నివసించే మనుషులు, ఋషుల గురించి ఈ గ్రంథం తెలియజేస్తుంది. ఇందులో 7 బ్రాహ్మణులకు అనుబంధంగా 7 అరణ్యకాలు ఉన్నాయి.

ఉపనిషత్తులు

వేదసాహిత్యంలో ఉపనిషత్తులు చివరివి. అందుకే వీటిని వేదాంతాలు అంటారు. ఇవి మొత్తం 108. ఉపనిషత్తుల్లో ఎక్కువగా తాత్విక ఊహాగానాలు ఉంటాయి. ఆత్మ, పరమాత్మ, జన్మ, పునర్జన్మ, కర్మ, మోక్షం వంటి అంశాలన్నీ ఇందులోనే చర్చించబడ్డాయి. ముఖ్యమైన ఉపనిషత్తులు 1) ముండకోపనిషత్తు, 2) శ్వేతేశ్వతార ఉపనిషత్తు, 3) జబలోపనిషత్తు, 4) చాందోగ్య ఉపనిషత్తు.

భారత చిహ్నంలోని ‘సత్యమేవ జయతే’ అనే సూక్తి ముండకోపనిషత్తు నుండి తీసుకోబడింది.

వేదాంగాలు

ఇవి వేదాలకు అంగముల వంటివి. వేద పండితులకు వీటి జ్ఞానం తప్పనిసరి. వేదాంగాలు ఆరు. అవి: 1) శిక్ష, 2) నిరుక్త, 3) ఛందస్సు, 4) వ్యాకరణం, 5) జ్యోతిష్యం, 6)కల్ప. ఈ కల్పలోనే యజ్ఞయాగాలకు సంబంధించిన గృహసూత్ర, శ్రౌతసూత్ర, సుళువసూత్ర అనే మూడు భాగాలున్నాయి.

గృహసూత్ర:
ఒక వ్యక్తి మోక్షం పొందుటకు చేయవలసిన షోడశ కర్మల (16 యజ్ఞాలు) గురించి ప్రస్తావించబడ్డాయి. ఒక వ్యక్తి తల్లి గర్భం నుండి స్మశానానికి వెళ్ళేవరకు ఈ 16 యజ్ఞాలను నిర్వహించినట్లయితే మోక్షం పొందుతాడని నమ్మకం.
1) గర్భాదానం: వివాహిత స్త్రీ గర్భం దాల్చుటకు చేసే యజ్ఞం.
2) పుంశవన: గర్భవతి స్త్రీ పుత్రసంతానం కోసం చేసే యజ్ఞం.
3) సీమంతోన్యాయ: సుఖప్రసవం కోసం చేసే క్రతువు.
4) జాతకకర్మ: పుట్టిన శిశువు జాతకమును తెలుసుకొనుటకు చేసే యజ్ఞం.
5) నామకరణ: పుట్టిన శిశువుకు పేరు పెట్టే క్రతువు.
6) నిష్క్రమణ: తొలిసారిగా శిశువును బయటకు తీసుకువెళ్ళే క్రతువు.
7) అన్నప్రాసన: తొలిసారిగా ఆహారాన్ని అందించే క్రతువు.
8) చూడకర్మ: తొలిసారి గుండు కొట్టించే క్రతువు.
9) కర్ణవేద: చెవులు కుట్టించే క్రతువు.
10) విద్యారంభ: విద్యను ప్రారంభించే క్రతువు.
11) ఉపనయన: ఇది కేవలం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య పురుషులకు మాత్రమే ఎనిమిదేళ్ల వయసులో గాయత్రి మంత్రం చదువుతూ పవిత్రతాడును(జంధ్యం) వేస్తారు. ఉపనయనం పాటించేవారిని ద్విజులు అంటారు. ఇది కేవలం పురుషులకు మాత్రమే.
12) వేదారంభ: వేద విద్యను అభ్యసించడానికి ఆశ్రమాలకు వెళ్ళే క్రతువు.
13) కేశాంత: ఆశ్రమాలలో కేశఖండనం(గుండు కొట్టించడం) చేసే క్రతువు.
14) సమావర్తన: విద్యను పూర్తిచేసుకొని ఇంటికి వచ్చే క్రతువు.
15) వివాహం: బ్రహ్మచర్యమును వీడే క్రతువు.
16) అంతేస్తి: మరణం తర్వాత చేసే చివరి కర్మ.

(క్రతువు అంటే యాగం/కార్యం అని అర్థం)

శ్రౌతసూత్ర

ఇందులో రాజు రాజ్యం మరియు ప్రజల సంక్షేమం కొరకు చేయవలసిన యాగాల గురించి వివరించబడ్డాయి. దీనిని సామాన్య ప్రజలు చేయడానికి వీలులేదు.
1) అశ్వమేధయాగం: ఇవి ఇతర రాజ్యాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చేసే యాగం.
2) రాజసూయయాగం: దైవత్వం పొందుటకు చేసే యాగం
3) వాజపేయ: రాజు నూతన శక్తిని పొంది ఉత్తేజితుడు కావడానికి చేసే యాగం. ఈ యాగం చేసిన తర్వాత రాజుకు ‘సామ్రాట్’ అనే బిరుదు లభిస్తుంది.
4) సులువసూత్ర: ఇది హోమగుండాల ఆకారం, పరిమాణాల గురించి తెలియజేసే గ్రంథం. ఈ గ్రంథంలో రేఖాగణిత పరిజ్ఞానం నిక్షిప్తమై ఉంది.

పురాణాలు

పురాణాలు పౌరాణిక గాథలతో పాటు ప్రాచీన చరిత్ర అధ్యయనానికి ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తాయి. ఇవి కలియుగంలోని రాజుల వంశ చరిత్ర గురించి, వంశావళిని తెలియచేస్తాయి. పురాణాలు మొత్తం 18. వీటిలో వాయిపురాణం, విష్ణుపురాణం, మత్స్యపురాణం, భాగవతపురాణం ముఖ్యమైనవి.

ఉపవేదాలు

ఇవి వేదాలకు అనుబంధంగా ఉంటాయి. ఇవి నాలుగు.
1) ఆయుర్వేదం : వైద్య శాస్త్రం గురించి తెలియచేస్తుంది.
2) ధనుర్వేదం: విలువిద్య గురించి తెలియచేస్తుంది.
3) గాంధర్వవేదం: సంగీతం గురించి తెలియచేస్తుంది.
4) శిల్పవేదం: శిల్పకళ గురించి తెలియచేస్తుంది.

ఇతిహాసాలు

ఇవి రెండు. 1) రామాయణం, 2) మహాభారతం.

1) రామాయణం: దీనిని వాల్మీకి సంస్కృతంలో రచించాడు. రామాయణాన్ని ఆదికావ్యమని, వాల్మీకిని ఆదికవి అని అంటారు. దీనిలో 7 కాండములు, 24000 శ్లోకాలు ఉంటాయి.

2) మహాభారతం: దీని రచయిత వ్యాసమహర్షి. ఇందులో 18 పర్వాలు ఉంటాయి. మహాభారతం యొక్క అసలు పేరు జయసంహిత. ఇందులో లక్ష శ్లోకాలు ఉండడంవల్ల ‘శతసహస్రసంహిత’ అని కూడా అంటారు.

-బానోత్ కళ్యాణ్

Latest News

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

జూలై 27, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి త్రయోదశి మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం మూల ఉదయం 11.00 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం వైధృతి రాత్రి 12.18 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News