గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే వినుండ్రి.

ముక్కుమొకం తెల్వని ఒకాయినె ఓ నెంబర్కు పోను శేసిండు. తమిళనాడుల సేలం జిల్లా పుదుకొత్తంబాడి తహసీల్దార్ ఆపీసునుంచని శెప్పిండు. మీ ఊల్లల్ల కరోనా అసంటి ఓ కొత్త రకం రోగమొత్తాందని భయపెట్టిండు. యిదేశాలల్ల గీ రోగమొచ్చినోల్లంతా గుండు గీయించుకున్నారని శెప్పిండు. తమిళనాడు సర్కార్ కూడా గిదే నిర్ణయం తీసుకుందన్నడు. గుండు గీయించుకున్న ఆడోల్లకు 15 యేల రూపాయిలు, కాలేజీల సదివే అమ్మాయిలకు అయితే 45 యేల రూపాయిలు. ఒక ల్యాప్‌టాప్, మొగోల్లకైతే 6 యేల రూపాయిలు ఇత్తానమన్నడు. గా లిస్టుల మీ పేరు ఉందని మీకు పోన్ శేత్తున్నమని శెప్పిండు. ఇగామె ఊకుంటాది. గీ ముచ్చటను సుట్టుపక్కలోల్ల శెవులేసింది. ఇగైపాయె ముగ్గురు అమ్మలక్కలు తయారైండ్రు. గా మంగలాయినె దగ్గరికి పోయిండ్రు. గుండు గీయించకుండ్రు. ఇగిది సూసి మరో ఇరవై, ముప్పై మంది తయారు కానే అయిండ్రు. గీ లోపల గా ముగ్గురు ముందుగ పైసలేయించుకోవాల్నని, గా పోను శేసినాయినెకు తిరిగి పోను శేసిండ్రు. ఇగాయింత గా పోను స్వచ్చాప్ అయింది. ఎంతకూ గా పోను పని శేయకపోబట్టి, మోస పోయినమని గుర్తించిండ్రు. గా దెబ్బకు గా గుండు గీయించుకుంటానికి సిద్దమైన మిగతా ఆడోల్లు బందైండ్లట. యిగాంత పోయి పోలీసులకు శెప్పిండ్లంట. గిదిన్నోల్లు ఆశీరపోతాండ్రంట. ఇగిది నెట్టింట మస్తు వైరలైతాంది.

