సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది. గదెట్టంటే…
మహారాస్ట్ర సోలాపురం జిల్లా కేడ్ గావ్ కు చెందిన నవ్ నాథ్ దొండియా గైక్వాడ్, 24 ఏండ్ల కింద అవ్వయ్య మీద కోపంతోటి ఇంట్లకెల్లి ఎల్లిపోయిండు. ఇగ జాడ తెల్వకపోయే సరికి, సచ్చిపోయిండనుకున్నరు. ఇగీమద్దెల సర్ ఓటర్ల సవరణ జరుగుతాంది కదా? గండ్ల.. బుల్దాన జిల్లా మల్కాపూర్ ల బూత్ ఆపీసర్, నవ్ నాథ్ సొంతూరు కేడ్ గావ్ గా గుర్తించిండు. గిది నిజమో కాదో తెలుసుకునేటండుకు కేడ్ గావ్ బూత్ ఆపీసర్ ను అడిగిండు. గాయినె సచ్చిపోయినట్లు తన దగ్గర రికార్డుందని శెప్పిండు. గట్లనే గా ముచ్చటను నవ్ నాథ్ కుటుంబానికి శేరేసిండు. గీ మాటను పట్టుకుని మల్కాపూర్ కు యెల్లి సూత్తె.. గాయినె గా తప్పిపోయిన తమ కుటుంబ సభ్యుడు నవ్ నాథేనని గుర్తించిండ్రు. ఇగాయినెను తీసుకొని కేడ్ గావ్ కు ఒచ్చిండ్రు. 24 ఏండ్ల కింద తప్పిపోయిన కొడుకును శూసి తల్లి, మిగతా కుటుంబమంతా తెగ సంబరపడ్తాండ్రు.

