Thursday, September 17, 2026
27.7 C
Hyderabad

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు ముసురుకుంది. ఇది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు పెను హెచ్చరికగా మారింది. ఈ జలసంధి మూసివేయడంతో చమురు సరఫరా నిలిచిపోయింది. సరఫరా తగ్గితే ధరలు పెరగడం, ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగడం, ద్రవ్యోల్బణం పెరిగితే కొనుగోలు శక్తి తగ్గడం, ప్రజల జీవన వ్యయం మరింత భారమవడం అనివార్యం.

ప్రపంచ రోజువారీ చమురు వినియోగంలో 20% హార్మూజ్ జలసంధి నుంచే సరఫరా అవుతోంది. ఈ మార్గం ద్వారా జరిగే చమురు ఎగుమతుల్లో 82% ఆసియాకు వెళ్తున్నాయి. ఇందులో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వాటా 67%గా ఉంది. భారత్ ముడి చమురులో 90% మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే వస్తోంది. అందులోనూ గణనీయంగా గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతార్ ల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 40% హార్మూజ్ జలసంధి నుంచే వస్తున్నాయి.
ప్రపంచ వాణిజ్యాన్ని పర్యవేక్షించే సంస్థ ’కెప్లర్’ గణాంకాల ప్రకారం, ఫిబ్రవరి 24 నాటికి రోజుకు 2.6 మిలియన్ బ్యారెళ్ల చమురు హార్ముజ్ మార్గం ద్వారా భారతదేశానికి చేరేది. అమెరికా దాడుల నేపథ్యంలో ప్రపంచ చమురు ధరలు బ్యారెల్‌కు 72.87 డాలర్లకు పెరిగాయి. ఒకే రోజులో 6 డాలర్లు పెరిగాయి.

బ్యారెల్‌కు రూ.10 పెరిగితే, మనదేశ దిగుమతులపై 140 బిలియన్ డాలర్లు అంటే రూ.1.27 లక్షల కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుందని అంచనా. ఇది మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రూపాయి మారకం విలువ తగ్గడం వంటి ఒత్తిళ్ళలో ఉన్న తరుణంలో చమురు ధరల పెరుగుదల మరింత సంక్లిష్టతను తీసుకువస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ద్వారా రవాణా వ్యయం పెరుగుతుంది. ఆహార పదార్థాల నుంచి పరిశ్రమల ఉత్పత్తుల వరకు మొత్తం జీవన ప్రక్రియకు వ్యాపిస్తుంది.

దేశం వద్ద 70–75 రోజుల వినియోగానికి సరిపడా చమురు నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో నిల్వ చేసిన వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు తాత్కాలిక ఉపశమనాన్ని కల్పిస్తాయి. అదనంగా, రష్యా వంటి ప్రత్యామ్నాయ వనరుల నుంచి సరఫరా కొనసాగుతున్నది. ఇవి తాత్కాలిక రక్షణ మాత్రమే. హార్ముజ్ మార్గం దీర్ఘకాలం మూతపడితే, నిల్వలు క్రమంగా ఖాళీ అవుతాయి. ధరల ఒత్తిడి పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోలు పోటీ తీవ్రమవుతుంది.

అమెరికా, ఇరాన్, రష్యా, గల్ఫ్ దేశాలతో సంబంధాలను సమన్వయం చేసుకోవడం అవసరం. తటస్థ వైఖరితో జాతీయ ప్రయోజనాలను రక్షించుకోవడం కీలకం. ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతులను పెంచడం, పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి సారించడం, విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలు మాత్రమే భవిష్యత్ సంక్షోభాలను తగ్గించగలవు.

ప్రస్తుత పరిస్థితి యుద్ధం మరింత విస్తరించే సంకేతాలు ఇస్తోంది. లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, గల్ఫ్ లో మిస్సైల్ హెచ్చరికలు, అంతర్జాతీయ నౌకాశ్రయాలపై భద్రతా ఆందోళనలు ప్రపంచానికి అప్రమత్త సంకేతాలే. ఈ సంక్షోభం త్వరగా చల్లారకపోతే, ఇది కేవలం ప్రాంతీయ యుద్ధం కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపే పరిణామంగా మారే ప్రమాదం ఉంది.

హార్ముజ్ జలసంధి చుట్టూ ఏర్పడిన ఈ సంక్షోభం భారత్‌కు కఠిన పరీక్ష. దీర్ఘకాలంలో ఇంధన భద్రతను పటిష్ఠం చేయడం తప్పనిసరి. సమయోచిత వ్యూహం, చురుకైన రాజనీతి చర్యలు, ప్రత్యామ్నాయ ఇంధనాల ప్రోత్సాహం ఈ సంక్షోభం నుంచి భారత్‌ను రక్షించగల మార్గాలు.

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News