Wednesday, June 24, 2026
29.8 C
Hyderabad

సీఎం గారూ..! ముందున్న మూడేళ్ళే అసలైన పరీక్ష!!|EDITORIAL

విజయోత్సాహం పాలనలో అలసత్వానికి దారితీయకూడదు. స్థానిక సంస్థల ఫలితాలు సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా బలాన్నిచ్చినా, అదే సమయంలో ప్రజల అంచనాలు కూడా పెంచాయి. ఆ అంచనాలకు అనుగుణంగా పరిపాలన సాగితేనే భవిష్యత్ ఎన్నికల్లోనూ విజయం సాధ్యమవుతుంది. ప్రజా సమస్యల పరిష్కారమే ఏ పార్టీకైనా, ప్రభుత్వానికైనా అసలైన బలం.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచాయి. ఎంపీ, ఉప ఎన్నికలు, పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల వరుస ఫలితాలు ఆయనకు రాజకీయంగా తిరుగులేని బలాన్నిచ్చాయి. పార్టీ ఢిల్లీ అధిష్ఠానం నుంచి ప్రశంసలు అందుకోవడం కూడా ఆయన స్థానాన్ని మరింత సుస్థిరం చేసింది.

ప్రభుత్వం విఫలమైందని ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి కొంతకాలంగా ప్రచారం చేస్తోంది. తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటిన నేపథ్యంలో ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరిగిందనే అంచనాలు రాజకీయ వర్గాల్లో వినిపించాయి. కానీ స్థానిక ఎన్నికల ఫలితాలు ఆ అంచనాలకు విరుద్ధంగా వచ్చాయి. ఇది ప్రతిపక్షానికి హెచ్చరిక అయితే, అధికార పక్షానికి మరింత బాధ్యతగా వ్యవహరించడానికి, ఆత్మపరిశీలనకు అవకాశం.

ఎన్నికల విజయాలు నాయకత్వ నైపుణ్యాన్ని సూచిస్తాయి. ముఖ్యమంత్రి జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేయడం, పార్టీలో సీనియర్లను ఏకతాటిపై నడిపించడం వంటి వ్యూహాలు మంచి ఫలితాల్నిచ్చాయి. కాంగ్రెస్‌లో సహజంగా కనిపించే అంతర్గత అసమ్మతిలను అధిగమిస్తూ రేవంత్ తన స్థానాన్ని బలపరుచుకున్నారు. పదిలపరుచుకున్నారు.

ఇక సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రం ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలపై దృష్టి సారించాల్సి ఉంది. మంచినీరు, సాగునీటి సమస్యలు అనేక ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల నుంచి ధాన్యం సేకరణ, గిట్టుబాటు ధరల కల్పనలో స్పష్టత అవసరం. నిరుద్యోగ సమస్య ఇంకా యువతను వేధిస్తోంది. ఏసీబీ దాడులు ఎన్ని జరిగినా, ప్రభుత్వ యంత్రాంగంలో ఇంకా అవినీతి పెరుగుతూనే ఉన్నది. రోజుకో చోట లంచం కేసులు వెలుగులోకి రావడం ఆందోళనకరం. విద్యుత్ శాఖలో ఉద్యోగుల సస్పెన్షన్లు జరిగినా, వ్యవస్థాపక సంస్కరణలు లేకపోతే సమస్య సమూలంగా పరిష్కారం కాదు.

మంత్రులపై ‘పర్సంటేజీల’ ఆరోపణలు ఉన్నాయి. వారి అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఇలాంటివి ప్రభుత్వ ప్రతిష్ఠకు దెబ్బతీస్తున్నాయి. పాలనలో సమన్వయం, జవాబుదారీతనం ఇంకా పెరగాలి. ప్రజలకు చేరువైన పారదర్శక వ్యవస్థ అవసరం. అవినీతిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే స్థానిక ఎన్నికల్లో వచ్చిన విజయాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోతే, అవసరాలను తీర్చకపోతే అసంతృప్తి పెరగక మానదు.

స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా స్థానిక అంశాలతోనే ప్రభావితమవుతాయి. అధికార పార్టీవైపు ప్రజలు మొగ్గడం సహజం. సార్వత్రిక ఎన్నికలు మాత్రం రాష్ట్ర స్థాయి పాలన, సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, రైతు సంక్షేమం వంటి విస్తృత అంశాలపై ఆధారపడతాయి. స్థానిక విజయాలు భవిష్యత్ సార్వత్రిక గెలుపునకు ఒక సానుకూలాంశమే తప్ప, అవే అసలైన విజయాలుగా ముందే భావించలేం.

2029లో జమిలి ఎన్నికలపై చర్చలు సాగుతున్నాయి. అదే నిజమైతే రాజకీయ సమీకరణాలు మారవచ్చు. వచ్చే మూడేళ్ళు అధికార పార్టీకి అత్యంత కీలక కాలం. ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా పాలనలో గుణాత్మక మార్పులు తీసుకురావాలి. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, వ్యవసాయ రంగానికి స్థిరమైన మద్దతు, పరిశ్రమల ప్రోత్సాహం, యువతకు ఉపాధి అవకాశాల సృష్టి వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణ అవసరం.

నిరంతరం ప్రజల మనసు గెలుచుకోవాలంటే వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. విజయోత్సాహం పాలనలో అలసత్వానికి దారితీయకూడదు. స్థానిక సంస్థల ఫలితాలు సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా బలాన్నిచ్చినా, అదే సమయంలో ప్రజల అంచనాలు కూడా పెంచాయి. ఆ అంచనాలకు అనుగుణంగా పరిపాలన సాగితేనే భవిష్యత్ ఎన్నికల్లోనూ విజయం సాధ్యమవుతుంది. ప్రజా సమస్యల పరిష్కారమే ఏ పార్టీకైనా, ప్రభుత్వానికైనా అసలైన బలం.

Latest News

చెట్లని …. “హత్య” చేస్తున్నారు!!|POETRY|ADUGU SPECIAL

హరిత తెలంగాణ... వనమావోత్సవం... అది.... ఇది.. . పేర్లతోటి.... నాయకులని ,అధికారులని తమను నాటమని మొక్కలు అడిగాయా..?? ...మీరే కదా నాటింది!! ఆ నాటడం కూడా... పోయి పోయి ఎక్కడ స్థలం లేనట్టు - విద్యుత్తు తీగల కింద నాటడం ఎందుకు చేశారు ?? అదేదో పెద్ద ఘనకార్యం...

పెండ్లాం కోసం ఇంట్ల మెట్లకే ఎస్కలేటర్?!|ADUGU TRENDS

ఆలుమొగల బంధం అమూల్యం, అపురూపమైంది. గందుకే ఒకర్నొకరు గౌరవించుకోవాలె. గట్లనే ప్రైజులు, సర్ ప్రైజులు ఇచ్చుకోవాలె. శెద్ద సూపాలె. టైమియ్యాలె. అభినందించాలె. ఇగ మొఘల్ రాజు షాజహానైతే భార్య ముంతాజ్ మహల్ మీద...

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా!?|EDITORIAL

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా? జాతీయ పార్టీల ప్రాభవం తగ్గి, సంకీర్ణాల యుగం అంతరిస్తోందా? జాతీయ పార్టీలు మళ్ళీ పుంజుకుంటున్నాయా? ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిపోతోందా? అవి ప్రమాదంలో పడ్డాయా? సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయా?...

జూన్ 24, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు దశమి రాత్రి 08.00 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం చిత్త సాయంత్రం 04.28 వరకు ఉపరి స్వాతి యోగం పరిఘ మధ్యాహ్నం 01.25 వరకు ఉపరి శివ కరణం తైతుల ఉదయం 07.45...

సిమిటి మాల్ కు శిన్న శిట్కా?!|ADUGU TRENDS

శిన్న శిన్న ఇకమతులే పెద్ద పెద్ద పనుల్ల శెమను తగ్గిస్తయి. అల్కగ అయ్యేట్లు శేత్తయి. గట్లనే ఇగో గీ ఉపాయమన్నట్లు. సిమిటి మాల్ కు ఓ శిన్న శిట్కాను కనిపెట్టిండు. గా పనిల...

ఎల్‌నినో హెచ్చరికలు : అప్రమత్తతలు|EDITORIAL

వాతావరణ మార్పులు భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశముందని ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అనిశ్చిత వర్షపాతం, తీవ్రమైన వాతావరణ ఘటనలు వ్యవసాయ రంగానికే కాదు, మానవ మనుగడకే కొత్త సవాళ్లను...

జూన్ 23, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు నవమి రాత్రి 07.28 వరకు ఉపరి దశమి నక్షత్రం హస్త మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి చిత్త యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.02 వరకు ఉపరి పరిఘ కరణం బాలవ ఉదయం 07.26...

జూన్ 22, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు అష్టమి రాత్రి 07.26 వరకు ఉపరి నవమి నక్షత్రం ఉత్తర మధ్యాహ్నం 02.37 వరకు ఉపరి హస్త యోగం వ్యతీపాత మధ్యాహ్నం 03.02 వరకు ఉపరి వరీయాన్ కరణం భద్ర ఉదయం 07.41...

‘తెలంగాణ జన’సేన అయ్యేనా?!|TELANGANA|JANASENA|PSPK

-ఏపీ తరహాలో స్వతంత్రంగా ఎదిగేనా?|AP -బీజేపీకి తోక పార్టీగా మిగిలేనా?|BJP -జన సేనతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?|JANASENA తెలంగాణ జనసేన అయ్యేనా?! తెలంగాణ జనం జన సేనను ఆదరించేనా? తెలంగాణలో జనసేన సక్సెస్ అయ్యేనా? సాధారణంగా...

సిమిటి, అస్తర్కార్ లేకుండనే గోడలు?!|ADUGU TRENDS

ఇల్లు కట్టి సూడు, పెండ్లి శేసి సూడన్నరు. గయి రెండంటే గంత కట్టమన్నట్లు.? పెండ్లంటే గిప్పట్ల సిడెంల అయిపోతానయి గనీ, గీ ఇండ్లంటేనే గవాటి టైం గయి తీసుకుంటయి. మట్టి, సిమెంటు, ఇటికె,...

సంపూర్ణ ఆరోగ్యానికి మార్గం యోగా!|EDITORIAL

ఆధునిక వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ చికిత్స కంటే, నివారణే ఉత్తమమనే సత్యం ఎప్పటికీ మారదు. యోగా అదే నివారణ వైద్యానికి ప్రతీక. మన పురాతన జ్ఞాన సంపదగా ప్రారంభమైన యోగా నేడు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 21 నుండి జూన్ 28 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టిన పనుల్లో క్రమంగా పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం వల్ల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు సులభంగా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News