Sunday, July 26, 2026
28.1 C
Hyderabad

మనం-వనమే జీవావరణం!|EDITORIAL

ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వన్యప్రాణులు గ్రామాలు, పట్టణాలలో సంచరించడం ఆందోళనకరంగా మారింది. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, అడవిపందులు, ఏనుగులు, కోతుల దాడులు కూడా పెరిగిపోతున్నాయి. వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడానికి ప్రధాన కారణం అడవులు అంతరించిపోతుండటం. దశాబ్దాలుగా అభివృద్ధి పేరుతో అడవులను నరికివేయడం, ఖనిజాల తవ్వకం, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, రోడ్లు, రైలు మార్గాల విస్తరణ, రియల్ ఎస్టేట్ విస్తరణ వంటి చర్యలు సహజ జీవావరణాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఒకప్పుడు విస్తారంగా ఉన్న అడవులు ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి జంతువుల సంచార మార్గాలను మూసేశాయి. ఫలితంగా ఆహారం, నీరు దొరకక వన్యప్రాణులు గ్రామాల వైపు మళ్లుతున్నాయి.

ఇది మనిషి–వన్యప్రాణి సంఘర్షణ. ఒకవైపు గ్రామీణులు భయంతో జీవిస్తుండగా, మరోవైపు నిరపరాధ వన్యప్రాణులు కూడా హింసకు గురవుతున్నాయి. జీవవైవిధ్యాన్ని కాపాడాల్సిన సమాజం, దానిని నిర్వీర్యం చేస్తుండటం అత్యంత బాధాకరం.

ప్రకృతి సమతౌల్యంలో అడవులు కీలకం. అడవులు వర్షపాతం నియంత్రణకు, భూగర్భజలాల పరిరక్షణకు, వాతావరణ సమతుల్యతకు, అనేక జీవజాతుల సంరక్షణకు ఆధారం. అడవులు తగ్గితే వాతావరణ మార్పులు తీవ్రతరం అవుతాయి. వరదలు, కరువులు, ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి సమస్యలు పెరుగుతాయి. గ్రామాల్లో వన్యప్రాణుల సంచారం కూడా అదే గొలుసు కట్టులోని ఒక దుష్పరిణామం.

వన్యప్రాణులను శత్రువులుగా కాకుండా జీవవ్యవస్థలో భాగస్వాములుగా చూడాలి. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, జంతువులను హింసించకుండా అటవీశాఖకు సమాచారం అందించే విధానం అలవాటు చేయాలి. సోలార్ ఫెన్సింగ్, బయో ఫెన్సింగ్ వంటి సాంకేతిక చర్యలు విస్తృతంగా అమలు చేయాలి. పంట నష్టానికి త్వరితగతిన పరిహారం చెల్లించే పారదర్శక వ్యవస్థ అవసరం.

అటవీ సంరక్షణలో ప్రభుత్వ పాత్ర కీలకం. కేవలం సంఘటనల తర్వాత స్పందించడం కాకుండా, దీర్ఘకాలిక ప్రణాళికతో అడవుల పునరుద్ధరణకు పాటుపడాలి. ఖాళీ భూముల్లో భారీ స్థాయిలో మొక్కలు నాటడం, సహజ అడవులను పునర్నిర్మించడం, వన్యప్రాణుల కోసం సంచార మార్గాలు-వైల్డ్‌లైఫ్ కారిడార్లను పరిరక్షించడం అత్యవసరం. అభివృద్ధి ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తున్నప్పుడు పర్యావరణ ప్రభావాన్ని కఠినంగా అంచనా వేయాలి. ఆతర్వాతే అనుమతులివ్వాలి.

“ఒక చెట్టు నరికితే పది చెట్లు నాటాలి” అనే భావన ఆచరణలోకి రావాలి. ప్రకృతి వనరులను దోచుకోవడం కాకుండా, బాధ్యతతో వినియోగించడం నేర్చుకోవాలి. పర్యావరణ పరిరక్షణను పాఠ్యాంశాలలో భాగం చేసి చిన్నప్పటి నుంచే అవగాహన పెంపొందించాలి.

ఇటీవల కొన్ని ప్రాంతాల్లో పెద్దపులుల సంచారం ప్రజలను కంటిమీద కనుకు లేకుండా చేశాయి. అటవీశాఖ సిబ్బంది మత్తు ఇంజెక్షన్లతో వాటిని పట్టుకుని అడవుల్లో విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇవి తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే. అడవుల పునరుద్ధరణ జరగనంత వరకు ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి.

ఈ ‘భూమి నాది’ అనే భావన మానవ అహంకారానికి ప్రతీక. నిజానికి మనం భూమికి అతిథులమే. ప్రకృతి మనకు ఇచ్చిన వరం అడవి. దాన్ని కాపాడుకోవడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవాలి. ప్రకృతిపై మనిషికి అధికారం లేదు. బాధ్యత మాత్రమే ఉంది అనే సత్యాన్ని గుర్తించాలి.

అభివృద్ధి తప్పనిసరి. కానీ అది ప్రకృతి విధ్వంసానికి దారితీయకూడదు. అడవులను కాపాడితే వన్యప్రాణులు సురక్షితంగా ఉంటాయి. వన్యప్రాణులు సురక్షితంగా ఉంటేనే మన జీవవ్యవస్థ సమతౌల్యంగా ఉంటుంది. జీవవ్యవస్థ సమతౌల్యంగా ఉంటేనే మనిషి భద్రంగా జీవించగలడు. వన్యప్రాణులను కాపాడటమంటే, మన భవిష్యత్తును కాపాడుకోవడమే.

Latest News

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News