Tuesday, September 15, 2026
32.2 C
Hyderabad

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY RASHI PHALALU

ఫిబ్రవరి 15 నుండి ఫిబ్రవరి 15 22 వరకు వార రాశి ఫలాలు

మేష రాశి
ఈ వారం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగం మరియు వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. కొత్త పనుల ప్రారంభానికి ఇది అనుకూల సమయం. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, అయితే ఖర్చులపై నియంత్రణ అవసరం. ఆరోగ్యం పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి,

వృషభ రాశి
ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో కొంత జాప్యం జరగవచ్చు, నిరాశ చెందకండి. కుటుంబంలో ఏకాభిప్రాయం లేక చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి, అప్పుల చక్రంలో పడకూడదు. ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది, శుభ ప్రయాణం అవుతుంది.

మిథున రాశి
ఈ వారం ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది. వృత్తిపరంగా కొత్త అవకాశాలు వస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులు కృషి చేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రియుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. డబ్బు రాకపోకలు పెరిగి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్యం విషయంలో కొద్దిగా అలసటగా అనిపించవచ్చు, విశ్రాంతి తీసుకోండి.

కర్కాటక రాశి
ఈ వారం సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగంలో పోటీ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో నష్టాలు రావచ్చు, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. మాటల వలన అనవసర వివాదాలు రాకుండా చూసుకోండి. ఆర్థికంగా బడ్జెట్ ప్లాన్ చేసుకుని ఖర్చు చేయడం మంచిది. ధైర్యంగా ఉండండి, సమస్యలు తాత్కాలికమే.

సింహ రాశి
ఈ వారం శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లేదా వేతన పెరుగుదలకు అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు ఆశించవచ్చు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం పూర్వకంగా ఉంటుంది, అయితే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

కన్య రాశి
ఈ వారం మీ దృష్టి కుటుంబం మరియు సంపాదనపై ఉంటుంది. సంపాదనలో పెరుగుదల కనిపిస్తుంది. భూమి, ఇల్లు వంటి ఆస్తుల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. చర్మ సంబంధ సమస్యలపై శ్రద్ధ వహించండి.

తులా రాశి
ఈ వారం మనోధైర్యం పెరుగుతుంది. వృత్తిలో సవాళ్లను ఎదుర్కొని విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా మారతాయి. స్నేహితుల నుండి సహాయం లభించవచ్చు. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. ఒంట్లో చురుకుదనం తగ్గినా, కొత్త ఉత్సాహంతో పనులు చేస్తారు.

వృశ్చిక రాశి
ఈ వారం కొంత అప్రమత్తత అవసరం. ఉద్యోగంలో శత్రువులు తలెత్తవచ్చు, జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక నష్టాలు జరగకుండా చూసుకోవాలి. అనుమానాలు మనస్సును కలచివేయవచ్చు. భాగస్వాములతో విభేదాలు రాకుండా సమన్వయం చేసుకోండి. కొత్త పెట్టుబడులు ప్రస్తుతానికి ఆపివేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు.

ధనస్సు రాశి
ఈ వారం అదృష్టం తోడుగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు కోరుకొచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. విదేశీ ప్రయాణ యోగం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.

మకర రాశి
ఈ వారం పనిలో పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగులతో కలిసి పనిచేస్తే విజయం సాధించవచ్చు. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం. ఆర్థికంగా మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. కుటుంబంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కాళ్లు మరియు మోకాళ్ల నొప్పులపై శ్రద్ధ వహించాలి.

కుంభ రాశి
ఈ వారం సృజనాత్మకత పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ఆలోచనలకు మంచి స్పందన లభిస్తుంది. వ్యాపారంలో కొత్త భాగస్వాములు లభించవచ్చు.సంబంధాలలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

మీన రాశి
ఈ వారం ఆధ్యాత్మికత పట్ల మక్కువ పెరుగుతుంది. ఉద్యోగంలో సామరస్యం నెలకొంటుంది. వ్యాపారంలో స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. మీ సౌమ్యత వలన అందరినీ ఆకట్టుకుంటారు. డబ్బు సంపాదన కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది, అదుపు చేయండి. పాదాలకు సంబంధించిన చిన్నపాటి సమస్యలు రావచ్చు.

ఆదివారం.ఫిబ్రవరి 15–2026

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం-శిశిర ఋతువు
మాఘమాసం–కృష్ణపక్షం

మహాశివరాత్రి

తిధి త్రయోదశి సాయంత్రం 04.30 వరకు
ఉపరి చతుర్దశి
నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 07.35 వరకు
ఉపరి శ్రవణ
యోగం వ్యతిపాత రాత్రి 02.54 వరకు
ఉపరి వరీయాన్
కరణం వణజి సాయంత్రం 04.30 వరకు
ఉపరి భద్ర
రాహుకాలం ఉదయం 04.30 నుండి
06.00 వరకు
దుర్ముహూర్తం సాయంత్రం 04.20 నుండి
05.05 వరకు
వర్జ్యం రాత్రి 11.49 నుండి 01.30
వరకు
సూర్యోదయం ఉదయం 06.44
సూర్యాస్తమయం సాయంత్రం 06.17

మేష రాశి
మీ ఉత్సాహం ఈ రోజు సహోద్యోగులను ఆకట్టుకుంటుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.

వృషభ రాశి
ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. మీ మాట తీరు ఇతరులను ఆకర్షిస్తుంది.

మిథున రాశి
కొత్త వ్యాపార ప్రయత్నాలకు ఇది సరైన సమయం. స్నేహితులు మీకు అనుకోని సహాయం చేస్తారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.

కర్కాటక రాశి
మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఎదురౌతాయి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి.

సింహరాశి
నాయకత్వ లక్షణాలు ప్రదర్శించడానికి ఇది మంచి రోజు. ధైర్యసాహసాలు పెరిగి కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆదాయం పెరిగే సూచన ఉంది.

కన్య రాశి
సహోద్యోగులతో సఖ్యతగా ఉంటుంది. పాత పెట్టుబడుల వల్ల లాభం చేకూరుతుంది. కుటుంబంలోని పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది.

తులా రాశి
భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను ఆర్జిస్తాయి. సామాజిక గౌరవం పెరిగే అవకాశం ఉంది. కళల పట్ల ఆసక్తి పెరిగి సమయం వెచ్చిస్తారు.

వృశ్చిక రాశి
గతంలో చేసిన కృషికి ఫలితం దక్కే రోజు. కార్యసాధనలో విజయం సాధించే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది.

ధనస్సు రాశి
ధైర్యసాహసాలు పెరిగి పోటీని ఎదుర్కొంటారు. స్వల్ప ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. దూరపు బంధువుల నుండి శుభవార్త అందుతుంది.

మకర రాశి
కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తి లావాదేవీలలో విజయం సాధిస్తారు. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి.

కుంభ రాశి
స్నేహితుల సహాయంతో క్లిష్ట సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యక్తిత్వ వికాసానికి అవకాశాలు ఎదురౌతాయి. సాంకేతిక విషయాలలో నైపుణ్యం చూపిస్తారు.

మీన రాశి
కోరికలు నెరవేరే అవకాశం ఉంది. విద్యార్థులకు కొత్త విషయాలు అధ్యయనం చేయడానికి అనుకూల సమయం. ఉద్యోగంలో ప్రతిభ ప్రదర్శించే అవకాశం లభిస్తుంది.

Latest News

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News