Tuesday, September 15, 2026
29.8 C
Hyderabad

నిన్న హరీశ్ రావు, నేడు కేటీఆర్… మరి రేపు!?|KCR|HARISHRAO|KTR|BRS|PHONE TAPPING

తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మరిపిస్తున్నది. రోజుకో మలుపుతో రోజురోజుకు మరింత ఉత్కంఠను రేపుతోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలతో మొదలైన ఈ కేసు, ఇప్పుడు ఆ పార్టీ అగ్ర నేతల వరకూ చేరింది. ఇప్పటికే ఈ కేసుతో సంబంధమున్న పోలీసు అధికారులను, బాధితులను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం… నిన్న మాజీ మంత్రి హరీశ్ రావును, నేడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు పిలిచింది. మరి ‘రేపు ఎవరు?’ అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. సర్వత్రా ఉత్కంఠతోపాటు ఆసక్తి రేపుతోంది.

హైదరాబాద్, జనవరి 22 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
తెలంగాణలో గత ప్రభుత్వ కాలంలో పోలీస్ విభాగాన్ని ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులు, పార్టీ నేతలు, వ్యాపారవేత్తలు, మీడియా వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసి, నిఘా పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇది జాతీయ, రాష్ట్ర భద్రత, శాంతి భద్రతల పేరుతో జరిగిందా? లేక పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమేనా? అనే అంశాలే దర్యాప్తులో కీలకంగా మారాయి. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం, నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేశారన్న అనుమానాలు బలపడుతున్నాయి.

ఈ కేసుతో సంబంధముందన్న ఆరోపణలతో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులను, పలువురు నేతలను, బాధితులను ‘సిట్’ విచారించింది. హరీష్ రావు నిన్నటి విచారణ ఈ కేసులో కీలక మలుపు. అప్పట్లో ఆయన కీలక మంత్రిగా ఉండటంతో, సిట్ అడిగిన ప్రశ్నలు రాజకీయ ఆదేశాల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ‘ఆ పెద్దాయన ఎవరం’టూ ప్రశ్నించినట్లు గుప్పుమంది. హరీష్ రావు తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, ఇది పూర్తిగా రాజకీయ కక్షతో కూడిన కేసని, కాంగ్రెస్ ప్రభుత్వం తమపై ప్రతీకారం తీర్చుకుంటోందని వ్యాఖ్యానించారు. అయితే, దర్యాప్తు సంస్థలు మాత్రం సాంకేతిక ఆధారాలు, అధికారుల వాంగ్మూలాల ఆధారంగా విచారిస్తున్నామని చెబుతున్నాయి.

ఇక నేడు కేటీఆర్ ను విచారిస్తుండటం ఈ కేసును ఆసక్తికరంగా మార్చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ, మున్సిపల్ పరిపాలన వంటి కీలక శాఖలను నిర్వహించిన కేటీఆర్, ప్రభుత్వంలో రెండో అధికార కేంద్రంగా వ్యవహరించారు. ఫోన్ ట్యాపింగ్ వంటి సున్నితమైన అంశం ఆయనకు తెలియకుండా జరిగిందా? లేదా వ్యవస్థాగతంగా తీసుకున్న నిర్ణయాలా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేటీఆర్ కూడా ఈ కేసును రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ, తాము న్యాయపరంగా ఎదుర్కొంటామని ప్రకటించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ‘రేపు ఎవరు?’ అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది. ‘పెద్దాయన’ చెప్పాడనే వాంగ్మూలాలు రావడాన్ని బట్టి చూస్తే, అప్పటికీ, ఇప్పటికీ బీఆర్ఎస్ లో, అప్పటి ప్రభుత్వంలోనూ కేసీఆర్ నే ‘పెద్ద సారు’, ‘పెద్దాయన’ అని సంబోధించేవారు. ఆయితే ఆ పెద్దాయన కేసీఆరేనా? అన్న చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాల నేతలు, ప్రముఖులు, సొంతపార్టీలోని పెద్దలు వగైరా దాదాపు ఆరు వేల మంది ఫోన్లు ట్యాప్ అయినట్లుగా వెల్లడవడాన్ని బట్టి, అంతటి స్థాయిలో నిఘా వ్యవస్థ పనిచేయాలంటే అత్యున్నత రాజకీయ అనుమతి అవసరమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆ అత్యున్నత అధికారం ఆనాడు కేసీఆరే నిర్వర్తించారు. అయితే, కేసీఆర్‌ను నేరుగా ఈ కేసుతో అనుసంధానించేలా ఇప్పటివరకు అధికారిక ప్రకటనలేవీ లేవు. అయినప్పటికీ, దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ ఎవరెవరి పాత్ర బయటపడుతుందన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.

రాజకీయంగా ఈ కేసు కాంగ్రెస్‌కు ఒక ఆయుధంగా మారినట్టు కనిపిస్తోంది. బీఆర్‌ఎస్ పాలనలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన్నాయని, వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, బీఆర్‌ఎస్ మాత్రం ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్య అని, ఎన్నికల్లో ఓడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తమను టార్గెట్ చేస్తోందని విమర్శిస్తోంది. ఈ పరస్పర ఆరోపణల మధ్య, ప్రజలు మాత్రం అసలు నిజం ఏమిటన్నదానిపై స్పష్టత వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు.
న్యాయపరంగా చూస్తే, ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత సున్నితమైన విషయం. చట్టబద్ధమైన అనుమతులు, స్పష్టమైన కారణాలు లేకుండా ఫోన్లు ట్యాప్ చేయడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో వ్యక్తిగత గోప్యత హక్కును మౌలిక హక్కుగా గుర్తించింది. అలాంటి పరిస్థితిలో, ఈ కేసులో ఆరోపణలు నిజమైతే, ఇది కేవలం రాజకీయ కేసు కాకుండా, ఒక పెద్ద రాజ్యాంగ సంక్షోభంగా కూడా మారే అవకాశం ఉంది.

ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో దీర్ఘకాల ప్రభావం చూపే అంశంగా మారింది. ఇది బీఆర్‌ఎస్ నాయకత్వానికి పెద్ద సవాల్‌గా మారుతుందా? లేక కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా ఎదురుదెబ్బ అవుతుందా? అన్నది మరికొద్ది రోజుల్లోనైనా తేలుతుందా? చూడాలి మరి.

Latest News

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News