Thursday, July 30, 2026
23.4 C
Hyderabad

STARTUP|స్టార్టప్‌లకు ATA|ఆటా ప్రోత్సహించడం అభినందనీయం

హాజరైన పలువురు ఐటీ ప్రముఖులు|IT

INTERNATIONAL|అంతర్జాతీయ వేదికగా ఆటా స్టార్టప్ పిచ్ డే

IIT HYDERABAD|ఐఐటీ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహణ

ఐటీ రంగంలో స్టార్టప్ కంపెనీలను అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) ప్రోత్సహించడం అభినందనీయం అని పలువురు ఐటీ రంగ ప్రముఖులు కొనియాడారు. శనివారం అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ‘ఆటా వేడుకలు–2025’లో భాగంగా ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (విద్యాశాఖ), ఐఐటీ హైదరాబాద్ సహకారంతో హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్‌లోని కన్వెన్షన్ సెంటర్ ఆడిటోరియంలో ఆటా స్టార్టప్ పిచ్ డే కార్యక్రమంలో స్టార్టప్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, విద్యా సంస్థలు, ఐటీ రంగ నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. స్టార్టప్‌లను ప్రోత్సహించడం, వాటికి నిధులు, దిశ నిర్దేశం అందించడం, గ్లోబల్ నెట్‌వర్క్‌ను నిర్మించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఆటా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి, ఇతర ప్రతినిధులు పాల్గొనగా, ముఖ్య అతిథిగా మైతీ స్టార్టప్ హబ్ (ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ) సీఈఓ డా. పన్నీర్సెల్వం (పీఎస్) మదనగోపాల్ హాజరై మాట్లాడుతూ, దేశంలో స్టార్టప్ ఎకోసిస్టం వేగంగా విస్తరిస్తోందని, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు, మైతీ స్టార్టప్ హబ్ అందిస్తున్న సహకారం వల్ల యువ ఇంజనీర్లకు అనేక అవకాశాలు లభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణలే భవిష్యత్‌ ఆర్థిక వృద్ధికి పునాదని స్పష్టం చేశారు. అలాగే ఎఐ కూడా భవిష్యత్ కు నూతన నాంది పలుకుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో స్కేలింగ్ స్టార్టప్స్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చ ఆకట్టుకుంది. ఈ చర్చలో డా. పన్నీర్సెల్వం మదనగోపాల్‌తో పాటు ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్‌, కో–ఇన్నోవేషన్ అండ్ హెడ్ ఆఫ్ రీసెర్చ్/ఇన్నోవేషన్ అవుట్‌రీచ్ రమేష్ లోగనాథన్, సునేరా గ్రూప్ వ్యవస్థాపకుడు రవి రెడ్డి, డల్లాస్ వెంచర్ క్యాపిటల్ భాగస్వామి కిరణ్ చంద్ర కళ్లూరి, ఐఐటీ హైదరాబాద్ మెటీరియల్స్ సైన్స్ ప్రొఫెసర్ ముద్రిక ఖండేల్వాల్ పాల్గొన్నారు. స్టార్టప్‌లు ఎదగడంలో ఎదురయ్యే సవాళ్లు, పెట్టుబడుల సమీకరణ, మార్కెట్ విస్తరణ, టెక్నాలజీ వాణిజ్యీకరణ, గ్లోబల్ భాగస్వామ్యాలపై వారి అభిప్రాయాల్ని చెప్పారు. అలాగే పిచ్ డేలో పాల్గొన్న స్టార్టప్‌లు తమ వ్యాపార ఆలోచనలు, ఉత్పత్తులు, సేవలను కాంపిటీషన్ న్యాయనిర్ణేతలు రవి రెడ్డి, కిరణ్ తనికెళ్ల, కిరణ్ చంద్ర కళ్లూరి, శ్రీధర్ రంపల్లి, రాజేష్ కోసూరి, రఘురామన్ రామమూర్తి, పార్థ సారధి కరంసెట్టి, జీవన్ కరంసెట్టి, ప్రసాద్ వడ్డాది, వెంకటేశం బి, భారవి కొడవంటి, వేను మాధవ్ వొడ్నాలకు వివరించగా, వారు ఉత్తమ స్టార్టప్‌లను.ఎంపిక చేశారు.

ఈ సెమినార్ ను ఉద్దేశించి ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి లు మాట్లాడుతూ, పవర్‌హౌస్, పేవ్‌స్టోన్, సక్సీడ్ ఇన్నోవేషన్, డల్లాస్ వెంచర్ క్యాపిటల్ సంస్థలు పూర్తి సహాయ సహకారాలు అందించాయని వారికి ధన్యవాదాలు తెలిపారు. ఉత్తమ స్టార్టప్‌లకు నిధుల అవకాశాలు, మెంటార్షిప్, పరిశ్రమల అనుసంధానం కల్పించడమే లక్ష్యంగా ఈ పిచ్ డే నిర్వహించామని తెలిపారు. భారతదేశం–అమెరికా మధ్య స్టార్టప్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో ఆటా స్టార్టప్ పిచ్ డే కీలక మైలురాయిగా చరిత్రలో నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీలు, కో చైర్ నరసింహ ద్యాసాని, సాయి సూదిని, శ్రీకాంత్ గుడిపాటి, ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బాణాల, బోర్డు ఆఫ్ ట్రస్టీ కాశీ కొత్త, రామకృష్ణ అల, శ్రీధర్ తిరిపతి, మాజీ అధ్యక్షులు పరమేష్ భీమ్ రెడ్డి, బిజినెస్ చైర్ హరీష్ బత్తిని, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సి రెడ్డి, విష్ణు మాధవరం, సుమ ముప్పల, తిరుమల్ రెడ్డి, రాజ్ కరకల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, సుమన్ బర్ల, వేణుగోపాల్ సంకినేని, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా తదితరులు పాల్గొన్నారు.

Latest News

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News