Thursday, September 17, 2026
25.5 C
Hyderabad

నిత్య నూతన ప్రేరణ మంత్రం వందేమాతరం!|EDITORIAL

బంకిం చంద్ర చటర్జీ రాసిన వందేమాతరం గీతం స్వాతంత్య్ర ఉద్యమానికి జవజీవాలు అందించడమే కాదు, సాంస్కృతిక జాతీయవాదానికి బీజం వేసింది. భారతదేశమంటే మట్టి కాదనీ… కర్తవ్యం, అంకితభావాలతో పునీతమైన పుణ్యతీర్థమనీ ప్రబోధించింది.
వందేమాతర గీతం వరసను మారుస్తూ, గాడి తప్పిన పాలకులు దీన్ని ప్రేరణగా తీసుకుని భారత పునరుజ్జీవానికి అంకితం కావాలి. కేవలం గీతాలాపనతో సరిపుచ్చక భారత ఉజ్వల భవిష్యత్‌కు ప్రేరణగా తీసుకోవాలి. దేశం ముందు వందనం చేయడంతో పాటు, సంకల్ప సిద్ధి కోసం వందేమాతరం గీతాన్ని ఆలపించాలి. స్వదేశీ స్వయం సమృద్దికి నేటికీ, రేపటికి, ఎప్పటికీ వందేమాతరం ప్రేరణ మంత్రంగా నిలవాలని ఆశిద్దాం.

మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

1875లో కార్తీక శుక్ల నవమి, జగద్ధాత్రి పూజనాడు పురుడు పోసుకున్న వందేమాతరం గీతం, అదే ఏడాది నవంబర్ 7న, దాన్ని రాసిన బంకించంద్ర చటర్జీ తన ‘బంగ్ల దర్శన్’ అనే సాహిత్య పత్రికలో ప్రచురించారు. 1882 లో ఆయన రాసిన నవల “ఆనంద మఠ్”లో కూడా ఈ గేయాన్ని చేర్చారు. ఈ పాట స్వాతంత్ర్య పోరాటానికి ఒక సంకేతంగా, సందేశంగా మారింది. 1896లో రవీంద్రనాథ్ ఠాగోర్ ఈ పాటను భారత జాతీయ కాంగ్రెస్ కోల్‌కతా సమావేశంలో గాత్రంగా ఆలపించారు. 1905లో బెంగాల్ విభజన ప్రతిపాదనకు వ్యతిరేకంగా జరిగిన స్వదేశీ ఉద్యమంలో ఈ పాట ప్రత్యేక ప్రేరణగా నిలిచింది. బ్రిటిష్ పాలకులు ఈ గీతాన్ని పాఠశాలల్లో పాడటాన్ని నిషేధించారు. అయినా ఈ పాట భారతావనిని ఏకం చేసింది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక, 1950 జనవరి 24న జరిగిన భారత రాజ్యాంగ సమావేశం ‘వందే మాతరం’ గీతాన్ని జాతీయ గీతంగా ఆమోదించింది.

వందేమాతర గీతానికి 150 ఏండ్లు కావస్తున్న సందర్భంగా 2025 నవంబర్ 7నుండి ఏడాది పాటు ‘ఒక మెలోడి ఒక చలనం’ పేరిట దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు, కళాశాలలు, వివిధ చోట్ల విద్యార్థుల సమూహాలతో, జాతీయ చైతన్య ర్యాలీలు, ప్రదర్శనలు జరగనున్నాయి.

‘వందే మాతరం’ అన్నపదాలు మాతృభూమికి సలాం చేస్తూ.. భాష, ప్రాంతం, మతాన్ని దాటే ఒక వసుధైక భావనగా మారాయి. బంకించంద్ర ఛటర్జీ కలం నుంచి జాలువారిన వందేమాతర గీతం…స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది.

స్వాతంత్రోద్యమ సమయంలో వందేమాతర గీతం మంత్రంగా పని చేసింది. దేశవ్యాప్తంగా మనం, మన దేశం, మన సార్వభౌమత్వం అనే ఉత్తేజాన్ని నింపింది. బ్రిటిష్‌ వారిని పారదోలేందుకు ఇది ఎంతగానో తోడ్పడింది. ప్రజలను ఏకం చేయడంలో వందేమాతర గీతం ఏక సూత్రంగా పని చేసింది. ఎక్కడిక్కడ వందేమాతరం గీతాలాపనతో ప్రజలు ఉద్యమంలో దుమికారు.

వందేమాతర గీతంలో భారతదేశ పురాతన సాంస్కృతిక మూలాలు ఈ గీతరచనకు ప్రేరణనిచ్చాయి. సర్వ మంగళ మాంగళ్యే శివే… అంటూ సాగే దేవీమాత స్తోత్రం వందేమాతరం గీతానికి ప్రేరణగా భావిస్తారు. అందుకే కొందరు దీనిని పాడడానికి ఇప్పటికీ ఇష్టపడరు. ఇది మనదేశ దౌరభాగ్యంగా చూడాలి. మతం ముసుగులో కొందరు దీనిని తృణీకరించినా అది ప్రజల నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఉత్తేజిత గీతంగా నిలిచింది. భారతదేశ చరిత్రలో మహోద్యమాలకు కళలూ పాటలూ అంతరాత్మగా నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాటే పరవళ్లు తొక్కింది. జాతి భావోద్వేగాలను వెన్నుతట్టి స్వాతంత్య్ర కాంక్ష అనే సమిష్టి కార్యాచరణకు పురిగొల్పడంలో వందేమాతరం గీతం కీలకభూమిక పోషించింది. అందుకే భారత స్వాతంత్య్ర పోరాటంలో అత్యంత ప్రత్యేకమైనదిగా వందేమాతరం గీతం నిలిచింది.

స్వాతంత్య్ర ఉద్యమానికి జవజీవాలు అందించడమే కాదు, సాంస్కృతిక జాతీయవాదానికి బీజం వేసింది. భారతదేశమంటే మట్టి కాదనీ… కర్తవ్యం, అంకితభావాలతో పునీతమైన పుణ్యతీర్థమనీ ప్రబోధించింది. మహర్షి అరవిందుడు వర్ణించినట్లు బంకించంద్రుడు ఆధునిక భారత రుషి. ఆయన పదాలు జాతి ఆత్మను మళ్లీ మేల్కొలిపాయి. నిదురిస్తున్న జాతి తన ఆత్మబలాన్ని కూడగట్టుకుని, జాగృతం చేయడంలో వందేమాతరం గీతం ప్రముఖ భూమిక పోషించదనడంలో సందేహం లేదు.

బ్రిటిష్‌ పాలకుల ఇనుప ఉక్కు సంకెళ్ల కింద నలిగిపోతున్న తరుణంలో బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం జాతికి ప్రభాత గీతమైంది. మన సంస్కృతి, నాగరికతల పట్ల గర్వాభిమానాలను రేకెత్తించే గానమైంది. అణువణువునా మాతృభూమిపై భక్తి, అనురక్తి ఉట్టిపడేలా మేల్కొలిపే రణనినాద గీతమైంది. వందేమాతరం భాషా ప్రాంతీయ భేదాలకు అతీతంగా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు జాతిని జాగృతం చేసింది. 1946లో తిరుగుబాటు చేసిన రాయల్‌ ఇండియన్‌ నేవీలోని భారతీయ నావికులు వందేమాతరం అని నినదిస్తూ బ్రిటిష్‌ యుద్ధనౌకలపై జాతీయ పతాకను ఆవిష్కరించారు.

ఇన్నేళ్లయినా వన్నె తగ్గకుండా మనజీవితాల్లో అది పెనవేసుకుపోయింది. భారతజాతిని కలసి ఉంచే గీతంగా నిలిచింది. స్వాతంత్య్ర ఉద్యమంలో వెలిగిన ఈ గీతాజ్యోతి ఇంకా జాజ్వలామానంగా వెలుగుతోంది. ఇప్పుడు ఏడాది ఉత్సవాల్లో భాగంగా వందేమాతరం పూర్తి రూపంలో ప్రతిధ్వనిస్తూ యువత మనసుల్లో సాంస్కృతిక జాతీయవాదాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు. వందేమాతరం కేవలం గత వైభవ స్మరణం, సంస్మరణం కారాదు. మనజాతిని మేల్కొలిపే ఉజ్జ్వల భవిష్యత్తుకు ప్రేరణగానూ తీసుకోవాలి.
భారత ఆత్మను ఆవహించుకునే గీతం కావాలి. వందేమాతరం పారతంత్ర భారతదేశానికి తొలి మేల్కొలుపు. మొక్కవోని దీక్షను చాటిన స్వేచ్ఛా గీతమది. భారతదేశపు ఆత్మ నుంచి జనించిన ఈ గీతం అజరామజరంగా నిలుస్తుంది. తరతరాలకు ఉత్తేజమిస్తుంది. భారతీయత అనే కోణం నుంచి మన చరిత్ర, సంస్కృతి, విలువలు, సంప్రదాయాలను వీక్షించి… నిరంతరం స్ఫూర్తి పొంది… సదా కార్యాచరణలో నిమగ్నం కావాలని ప్రబోధించే దివ్య గానంగా వందేమాతరం నిరంతర స్మరణ కావాలి. వందేమాతర గీతం వరసను మారుస్తూ, గాడి తప్పిన పాలకులు దీన్ని ప్రేరణగా తీసుకుని భారత పునరుజ్జీవానికి అంకితం కావాలి. కేవలం గీతాలాపనతో సరిపుచ్చక భారత ఉజ్వల భవిష్యత్‌కు ప్రేరణగా తీసుకోవాలి. దేశం ముందు వందనం చేయడంతో పాటు, సంకల్ప సిద్ధి కోసం వందేమాతరం గీతాన్ని ఆలపించాలి. స్వదేశీ స్వయం సమృద్దికి నేటికీ, రేపటికి, ఎప్పటికీ వందేమాతరం ప్రేరణ మంత్రంగా నిలవాలని ఆశిద్దాం.

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News