Thursday, September 17, 2026
25.5 C
Hyderabad

విలీనం దినోత్సవం… చరిత్ర చెబుతున్న వాస్తవం|ESSAY

ఆనాడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎక్కడ?

స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఒక దేశంగా కొనసాగిన హైదరాబాద్ విమోచనమై భారతదేశంలో విలీనమైనప్పుటికి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇంకా ఆవిర్భవించనేలేదు. అయినా ఇప్పుడు బీజేపీ నాయకులు తెలంగాణ “విలీన దినోత్సవమా? విమోచన దినోత్సవమా?” అని రచ్చ చేస్తున్నారంటే చరిత్రను తారుమారు చేయడమే. వాస్తవాలను వక్రీకరించడమే.

స్వాతంత్ర్యం తర్వాత పరిస్థితి
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశమంతటా స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు కలిగి, సర్వత్రా ఆనందం వెల్లివిరిసింది. కానీ, అప్పటికే సొంత కరెన్సీ, పరిపాలన, సైన్యం సహా దేశంగా ఉన్న హైదరాబాద్ మాత్రం స్వతంత్రంగానే ఉండిపోయింది. నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి ఒప్పుకోలేదు. ఆనాడు నిజాం రాజ్యంలో రజాకార్లు ప్రజలపై అత్యాచారాలు, హింస యథేచ్ఛగా కొనసాగించారు. తెలంగాణలో ప్రజలు ఊర్లకు ఊర్లు వదిలేసి సమీప ఆంధ్రా ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు. అలవికాని పరిస్థితుల్లో అలా వీలుకాని ప్రజలు పరిస్థితిని తట్టుకోలేక సాయుధులై స్వతంత్ర పోరాటాలు చేశారు.
నిజాం పాలనలో రజాకార్లు ప్రజలపై హింసాత్మక దాడులు చేయడం మొదలుపెట్టారు. ఒకవైపు కమ్యూనిస్టులు, మరోవైపు అప్పటి సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన చాకలి ఐలమ్మ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం వంటి నాయకులు, కొందరు బయట అజ్నాతంలో, నల్లా నర్సింహులు లాంటి మరికొందరు జైళ్ళల్లో ఉండిపోయారు. ఈ హింసను అరికట్టడంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నుంచి స్వామి రామానంద తీర్థ, ఆంధ్ర మహాసభ నుంచి మాడపాటి హన్మంతరావు, రావి నారాయణ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, సురవరం ప్రతాపరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, దాశరథి కృష్ణమాచార్య, సూసర్ల శ్రీరామ నర్సింహ, పులిజాల వెంకట రంగారావు, కాళోజీ నారాయణరావు, బత్తిని మొగిలయ్య గౌడ్, కొండా వెంకట రంగారెడ్డి, వట్టికోట ఆల్వార్ స్వామి, కొండా లక్ష్మణ్ బాపూజీ, తదితర అనేకమంది వీర తెలంగాణ యోధులు సాయుధ రైతాంగ పోరాటం చేశారు. ఈ సుదీర్ఘ ధిక్కార పోరాటాన్ని గమనించిన ఇండియన్ యూనియన్ ప్రభుత్వం జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో ఒక రాజకీయ పరమైన నిర్ణయం తీసుకున్నది.

ఆపరేషన్ పోలో – తెలంగాణ విలీనం
ఈ సంఘటనల నేపథ్యంలో, భారత ప్రభుత్వం సైనిక చర్యకు దిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాలతో మేజర్ జనరల్ జయంత్ నాథ్ చౌదరి నేతృత్వంలో “ఆపరేషన్ పోలో” ప్రారంభమైంది. సైన్యం రజాకార్లను అదుపులోకి తెచ్చింది. చివరకు నిజాం రాజు లొంగిపోగా, 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్ లో విలీన ప్రకటన వెలువడింది. సెప్టెంబర్ 18న విలీన ప్రక్రియ పూర్తైంది.

ఆనాడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎక్కడ?
ఆ సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఉన్నా, వారు పోరాటాల్లో పాల్గొనలేదు. బీజేపీకి అప్పుడు ఉనికే లేదు. ఆర్ఎస్ఎస్ స్థాపకులు కేశవ్ బలీరాం హెడ్గేవార్, గోల్వాల్కర్, సావర్కర్ వంటి వారు “భారత యువత స్వాతంత్ర్య పోరాటాల్లో పాల్గొనకండి, మీ జీవితాలను నాశనం చేసుకోకండి” అని పిలుపునిచ్చిన చరిత్ర మన కళ్ల ముందే ఉన్నది. అంతే కాదు, 1948లో ఆర్ఎస్ఎస్ మీద కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. తర్వాత 1951లో జనసంఘ్ ఏర్పడింది. అది తర్వాత 1980లో బీజేపీగా మారింది.

నేటి రాజకీయాల్లో బీజేపీ పాత్ర
ఇప్పుడు బీజేపీ చరిత్రలో తమకు లేని పాత్రను, స్థానాన్ని కల్పితంగా చూపించుకోవాలనుకుంటోంది. మతతత్వాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్దిని పొందాలనుకుంటోంది. కానీ చరిత్రను ఎవరూ మార్చలేరు. సెప్టెంబర్ 17న తెలంగాణ భారతదేశంలో విలీనమైన దినం. అది విలీన దినోత్సవమే. కానీ, విమోచన దినోత్సవం కాదని చరిత్ర స్పష్టంగా చెబుతోంది.

-గోపాల బాలరాజు
సీనియర్ జర్నలిస్ట్ – 7337082570

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News