Friday, April 17, 2026
37.2 C
Hyderabad

ఒక్క దెబ్బకు..!|KCR|REVANTH REDDY|BJP|CONGRESS|BRS|CBI

బోనులోకి KCR|కేసీఆర్ కుటుంబం?
CBI|సీబీఐ భుజంపై తుపాకీ పెట్టి..
శిక్షపడితే CREDIT|క్రెడిట్ తమ ఖాతాలో
పడకపోతే నెపం BJP|బీజేపీ, సీబీఐ పై
కమల వ్యూహమా? కాంగ్రెస్ పన్నాగమా?

ASSEMBLY|అసెంబ్లీ తీర్మానంతో అనేక ప్రయోజనాలు
సేఫ్ జోన్ లోకి కాంగ్రెస్, సీఎం, ప్రభుత్వం
BRS|బీఆర్ఎస్ కు ప్రాణ సంకటం.. బీజేపీకి ఇరకాటం
సీబీఐ పనితీరుకు పరీక్షా సమయం!
సుదీర్ఘ మేధోమథనం తర్వాతే ఈ నిర్ణయం?

అవినీతి నిరూపితమైతే…
శిక్షలు KCR|కేసీఆర్, HARISH RAO|హరీశ్ రావులకే కాదు
EETALA|ఈటల, THUMMALA|తుమ్మల, నాటి కేబినెట్ సహా,
అధికారులంతా బొక్కలోకే
ఇప్పటికే ఏసీబీకి చిక్కి జైలులో పలువురు అధికారులు

ఇప్పటికింతే(నా)!?
ఇప్పటి స్థానికానికి అసెంబ్లీ తీర్మానం సరిపోతుంది?
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాకా సాగదీతే?
దిన దిన గండంగా భయం గుప్పిట్లో కేసీఆర్ కుటుంబం
కవితకు పట్టిన గతే తమకు పడుతుందా? అన్న అనుమానం
బీజేపీతో కుమ్మక్కైతే బీఆర్ఎస్ ఔట్
కాంగ్రెస్, బీజేపీ ఒక్కటైనా బీఆర్ఎస్ కే నష్టం
బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరైతే కాంగ్రెస్ కే లాభం

కేసు సీబీఐకి అప్పగింతతో
జాతీయ అంశంగా కాళేశ్వరం అవినీతి
శిక్ష పడితే క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో
శిక్ష పడకపోతే దోషం బీజేపీకి బదిలీ
శిక్ష పడ్డా, పడకపోయినా కాంగ్రెస్ కే లబ్ది

ఒక్క దెబ్బకు ఒక పిట్ట కష్టం కాబట్టి, రెండు పిట్టలు. అనే సామెత వచ్చింది. కానీ ఒక్క దెబ్బకు ఎన్ని పిట్టలో? అనే రీతిలో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తైనప్పటికీ, అప్పటికే అనేక మంది అధికారులు ఈ కేసులో ఏసీబీకి చిక్కి జైళ్ళల్లో ఉన్నప్పటికీ, అవినీతికి తగిన ఆధారాలున్నప్పటికీ సర్కార్ ఈ కేసుని సీబీఐకి ఎందుకు అప్పగించింది? ఈ కేసులో తగిన ఆధారాలున్నప్పటికీ, రాష్ట్ర విచారణ సంస్థలను కాదని, కేంద్ర సంస్థల ఇన్వాల్వ్ మెంట్ నెపంతో.. తమ కోర్టులోని బంతిని కేంద్రం కోర్టులోకి ఎందుకు విసిరింది? కాళేశ్వరం అవినీతిని జాతీయ స్థాయి ప్రచారానికి తీసుకెళ్ళడమేగాకుండా, కేసీఆర్ కుటుంబాన్ని బజారుకీడ్చడమే కాక, సిబిఐ ద్వారా మరింత పకడ్బందీగా, తమ చేతికి మట్టి అంటకుండా ప్రస్తుతం బోనులోకి.. తర్వాత బొక్కలోకి తేసేందుకేనా? శిక్షలు పడితే క్రెడిట్ కాంగ్రెస్ కొట్టేసి, పడకపోతే బీజేపీ, సీబీఐలకు అంటగట్టి, కాంగ్రెస్ సేఫ్ జోన్ కి వెళ్ళిపోయిందా? బీఆర్ఎస్ ను బీజేపీ కాళ్ళ దగ్గర పడేసినట్లైందా? కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు బీజేపీకీ బీఆర్ఎస్ బీ పార్టీ అయినా, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు కాంగ్రెస్, బీజీపీలు ఒక్కటైనా అవుటయ్యేది బీఆర్ఎస్సేనా? లేక బీజేపీ ఆరోపిస్తున్నట్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒక్కటై ఈ కేసును మరింత ఆలస్యం చేసి, దోషులను శిక్షల నుంచి తప్పించడానికేనా? ఏమైనా ఇప్పటికైతే ఇంతే! స్థానిక సమరానికి కేసును సీబీఐకి అప్పగింతతో సరిపెట్టి, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందుదాకా సాగదీసే విధంగానే కాంగ్రెస్ తెలివిగా బీఆర్ఎస్, బీజేపీలను ఇరికించిందా? ఇది కమల వ్యూహమా? కాంగ్రెస్ పన్నాగమా?

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుతోనే ముగిశాయి. 42శాతానికి అడ్డంకిగా ఉన్న చట్టాల సవరింపులతో, బీసీ బిల్లు పాస్ అయింది. వీటన్నింటి కంటే అనూహ్యంగా ఆదివారం అర్థరాత్రి దాటి 2 గంటల వరకు సమావేశమై చర్చించి, కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగిస్తూ అసెంబ్లీ తీర్మానించింది.

‘ఈ ప్రాజెక్టులో ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో వ్యాప్ కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పీఎఫ్సీ, ఆర్ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాలుపంచుకున్నాయి. అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు కూడా ఉన్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించడం సముచితం. అందుకే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది.’అని సీఎం ప్రకటించారు.

‘రిటైర్డ్ జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించింది. మూడు బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగే లేదని కమిషన్ తేల్చి చెప్పింది.’

‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ప్రకారం, మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ, విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి.’ అని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఇంత స్పష్టంగా దర్యాప్తులు, విచారణల నివేదికలు, ఆధారాలున్నప్పటికీ ప్రభుత్వం నేరుగా చర్యలు తీసుకునే వీలున్నా, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు, జాయింట్ అసెంబ్లీ కమిషన్ కో, సిట్ కో అప్పగించే అవకాశం ఉన్నా, సీబీఐకే ఎందుకు అప్పగించింది?

బీజేపీ కాళ్ళ దగ్గరకి బీఆర్ఎస్.. 
బీఆర్ఎస్ పై కోపంతోనో, కేసీఆర్ కుటుంబంపై కక్షతోనో, పక్షపాతంగానో, కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిలు నిర్ణయం తీసుకోలేదని నిరూపించడం ఒక ఎత్తైతే, పదేపదే ఎదురుదాడికి దిగుతున్న కేసీఆర్ కుటుంబాన్ని, ఇక తప్పించుకోలేని స్థాయి విచారణ బోనులోకి నెట్టేసింది. అంతేకాదు వాళ్ళని, ఆ పార్టీని బీజేపీ కాళ్ళ దగ్గర పడేసినట్లైంది. పకడ్బందీ విచారణ ద్వారా కచ్చితంగా శిక్షలు పడే విధంగా చేసింది. శిక్షలు పడ్డా బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం ఇక పదే పదే కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వం లక్ష్యంగా ఎదురుదాడికి దిగకుండా కట్టడి చేసింది. దిగినా అది ప్రయోజనం లేని ప్రయాసే కాకుండా, విచారణ సమయంలో ఇష్టానుసారంగా మాట్లాడితే సమస్యలు మరింత జఠిలం అయ్యే ప్రమాదమూ ఉంది.

సీబీఐ భుజంపై తుపాకీ పెట్టి… కేసీఆర్ కు గురిపెట్టి
ఇక సీఎం రేవంత్ రెడ్డి, సీబీఐ భుజంపై తుపాకీ పెట్టి.. కేసీఆర్ ను టార్గెట్ చేసినట్లైంది. విచారణలో శిక్షపడితే క్రెడిట్ తమ ఖాతాలో పడుతుంది. పడకపోతే నెపం బీజేపీ, సీబీఐ లపైకి పోతుందనేది ఒక ఎత్తుగడగా కనిపిస్తోంది.

మేధోమథనంతో..
అసెంబ్లీ తీర్మానంతో అనేక ప్రయోజనాలను రేవంత్ సాధించారు. పార్టీని, ప్రభుత్వాన్ని సేఫ్ జోన్ లో నిలబెట్టారు. పైగా ఈ ఇష్యూని బీఆర్ఎస్ కు ప్రాణ సంకటంగా, బీజేపీకి ఇరకాటంగా మార్చేశారు. పనిలోపనిగా సీబీఐ పనితీరుకు పరీక్షా సమయం పెట్టేశారు. రేవంత్, బహుషా సుదీర్ఘ మేధోమథనం తర్వాతే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు.

శిక్షలు కేసీఆర్, హరీశ్ రావులకే కాదు…
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల్లో అవినీతి నిరూపితమైతే, శిక్షలు కేవలం కేసీఆర్, హరీశ్ రావులకు మాత్రమే కాదు, అప్పటి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అప్పటి మంత్రి తుమ్మల, నాటి కేబినెట్ ని మంత్రులంతా అప్పటి నిర్ణయాలకు సమూహికంగా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ కేసుతో సంబంధమున్న అధికారులంతా బొక్కలోకి పోవాల్సిందే. ఇప్పటికే ఏసీబీకి చిక్కిన పలువురు అధికారులు జైల్లో ఉన్నారు. పైగా ఘోష్ కమిషన్ తన నివేదికలో 18 మంది ఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికింతే(నా)!?
ఇప్పటి స్థానిక సమరానికి ఈ అసెంబ్లీ తీర్మానం సరిపోతుందనే ఆలోచనల సీఎంలో ఉన్నట్లు ఉంది. బీఆర్ఎస్ కు బాస్ లుగా ఉన్న కేసీఆర్ కుటుంబాన్ని కమిషన్ విచారణ ఆధారాలతో అవినీతి బోనులో నిలిపి, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ముఖం చెల్లకుండా చేసినట్లైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసినా, తమను తాము రక్షించుకోవడానికే అవుతుంది తప్ప, పడిన మచ్చ చెరగిపోని పరిస్థితిని కల్పించినట్లైంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాకా సాగదీతే?
సీబీఐ విచారణ ద్వారా ఒకటి రెండు రోజుల్లో కేసు ముగియదు. పైగా విచారణ సాగే కొద్దీ కేసీఆర్ ఫ్యామిలీ భయం భయంగా, దినదిన గండంగా గడపడం ఖాయంగా కనిపిస్తోంది. కవితకు పట్టిన గతే తమకు పడుతుందా? అన్న అనుమానం కూడా కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ తదితరులకు నిత్యం వేధిస్తూనే ఉంటుంది.

పద్మవ్యూహంలో కేసీఆర్ కుటుంబం
పార్టీల మైలేజీ పరంగా చూస్తే, కేసీఆర్ కుటుంబం బీజేపీతో కుమ్మక్కైతే బీఆర్ఎస్ ఔట్ అవడం ఖాయం. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటైనా బీఆర్ఎస్ కే నష్టం. ఒకవేళ బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరైతే కాంగ్రెస్ కే లాభం. ఎటు చూసినా కాంగ్రెస్ కే లాభం చేకూరేలా వ్యూహం పన్నినట్లుగా కనిపిస్తోంది.

కేసు సీబీఐకి అప్పగింతతో
కాళేశ్వరం అవినీతిని రేవంత్, జాతీయ అంశంగా మార్చేశారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రత్యేకంగా వ్యూహాత్మకంగా జాతీయ స్థాయి ప్రచారం చేసుకున్నారు. మహానేతగా ఎక్స్ పోజర్ ఇచ్చుకున్నారు. తెలంగాణ తెచ్చిన తెలంగాణ గాంధీగా పొగిడించుకున్నారు. ఈ తెచ్చిపెట్టుకున్న ఖ్యాతిని అపఖ్యాతి చేయడానికి రేవంత్ రెడ్డి, కేసును సీబీఐకి అప్పగిడచం కలిసొచ్చిందనాలి. ఇప్పుడు కేసీఆర్ పై గతానికి పూర్తిగా వ్యతిరేకమైన ప్రచారం జరిగే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో కేసీఆర్ కి శిక్ష పడితే క్రెడిట్, కాంగ్రెస్ ఖాతాలోకే వెళుతుంది. శిక్ష పడకపోతే దోషం బీజేపీకి బదిలీ అవుతుంది. శిక్ష పడ్డా, పడకపోయినా కాంగ్రెస్ మాత్రం లబ్ది పొందుతుంది.

కేసీఆర్ ను వేధిస్తున్న ‘కవితా’నుభం!
లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు కవిత జైలు శిక్ష అనుభవించారు. జైలు నుంచి కవితను విడిపించుకోవడానికి కేసీఆర్ నానా తంటాలు పడ్డారు. కేటీఆర్, హరీశ్ రావుల ద్వారా బీజేపీతో పదే పదే బేరసారాలు నడిపారు. చివరకు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామన్నారని స్వయంగా కవితే వెల్లడించారు. విచిత్రంగా ఇప్పుడు అదే సీబీఐ బోనులోకి కేసీర్, హరీశ్ రావు లు పడ్డారు. ఇప్పుడు కవిత పార్టీకి దూరమైనట్లుగా కనిపిస్తోంది. కేటీఆర్ మెడ పైన ఫోన్ ట్యాపింగ్, కార్ల రేసు కేసులు వేలాడుతున్నాయి. ఈ కేసుల్లోంచి బయటపడటమెలా?

దిక్కు తోచకే.. నోరు జారిన కవిత?
ఇక కవిత సోమవారం మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రిని హరీశ్ రావు, సంతోశ్ రావులు తప్పుదోవ పట్టించారని నోరు జారారు. అంటే, కాళేశ్వరం సహా, జరిగిన అన్ని తప్పిదాలను అంగీకరిస్తున్నట్లుగా భావించాలా? లేక ప్రజల చూపును కేసు సీబీఐకి అప్పగింత నుండి తప్పించడానికా? కేటీఆర్ మాత్రం, సీబీఐ అంటే బీజేపీ ‘ప్రతి పక్షాల నిర్మూలన సెల్’ అంటూనే లీగల్ గానే ఎదుర్కోంటామని ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈటల మంచి చర్య అంటూనే, ఈ ఇష్యూని డిస్ ఓన్ చేసుకుందన్నారు.
మొత్తానికి ఉద్యమ సమయంలోనూ లేనంతగా బీఆర్ఎస్ అవినీతి నడి సంద్రంలో పీకల్లోతు కేసుల్లో కూరుకుపోతోంది. ఈ కష్టాలను కడతేర్చే ఆపన్న కమల-హస్తం కోసం అర్రులు చాస్తోంది. విధికి, కాలానికి ఎవరూ అతీతులు కారు కదా!

Latest News

భయమా? వ్యూహమా?|PARLIAMENT|Delimitation bill|TEJASWI SURYA|BJP|NARENDRA MODI

పాగాకై పాకులాటా? కస్సుమన్న కాంగ్రెస్!|CONGRESS భగ్గుమన్న బీఆర్ఎస్!!|BRS ఆత్మరక్షణలో బీజేపీ!!!|BJP వివాదానికి నేపథ్యమేంటి? ఇప్పుడు సూర్య, గతంలో మోదీ! చారిత్రక అంశాల వక్రీకరణా? రాజకీయ మైలేజీ వ్యూహమా? కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడమా? పునర్విభజన - దక్షిణాది భయమా? లోక్‌సభలో పునర్విభజన బిల్లుపై చర్చను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...

శింతపండు పురుగుపట్టది! నల్లబడది!!|ADUGU TRENDS

ఇగో గీ శింతపండు లేకపోతే ఎవ్వలికీ ఎల్లది. పప్పుశారు, సేప పులుసు, అంటుపులుసు, ఒట్టి సేపల పులుసు, దప్పడం, అన్ని తొక్కుల్ల ఏసుడే కాదు, ఆఖరికి శింతపండు తొక్కు కూడ శేసుకొని తింటం....

చట్టసభలు అ (కొ) 0దరి కోసమేనా!?|EDITORIAL

భారతదేశం వంటి 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కొందరే పదే పదే చట్టసభల్లో కొనసాగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. కొత్త ఆలోచనలు, కొత్త నాయకత్వం రావాలంటే వ్యవస్థలో మార్పులు అవసరం. మహిళల...

17-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అమావాస్య సాయంత్రం 05.25 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం రేవతి మధ్యాహ్నం 11.55 వరకు ఉపరి అశ్విని యోగం వైధృతి ఉదయం 07.10 వరకు ఉపరి విష్కమ్భ కరణం చతుస్పాద ఉదయం 06.15...

గిట్ల శేత్తే గా కుండల నీల్లు ప్రిజ్జంత సల్ల..గుంటయి!?|ADUGU TRENDS

పేదోల్ల అవ్వల్ దర్జా ప్రిజ్జి ఏందంటే? ఎవ్వలైనా ఏం శెప్తరు? మట్టి కుండ అంటరు! అవు మల్ల గీ నేల తల్లి, మన గా కుమ్మరన్నలు మనకిచ్చిన మట్టి కుండల నీల్లు పెయికి...

స్పష్టతలేని బిల్లులు సమస్యలకు హేతువులు!?|EDITORIAL

భారతదేశ ప్రజాస్వామ్య దశ, దిశను ప్రభావితం చేసే కీలక మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత అవసరం. ఈ రెండు అంశాల చుట్టూ ఉన్న అనుమానాలు, రాజకీయ వాదోపవాదాలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి....

16-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి బ చతుర్దశి రాత్రి 07.01 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 12.45 వరకు ఉపరి రేవతి యోగం ఐంద్ర ఉదయం 09.35 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం...

వాడి పడేసిన డబ్బల్ని వాడే ఇకమతు!?|ADUGU TRENDS

ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! ఉపాయం ఉంటే ఊరేగొచ్చట!! వాడి పడేసే డబ్బాల్ని గిట్ల వాడే ఇకమతు శేస్తున్న గీ అక్క ఉపాయం సూత్తే మీరే పరేషాన్ అయితరు! మనం పండ్లు కొంటే గ...

శాంతి చర్చలు-సజీవంగా ఆశలు!?|EDITORIAL

ప్రపంచంలో యుద్ధోన్మాద ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయి. పశ్చిమాసియా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య చర్చలు విఫలమవడం, ఇజ్రాయెల్ పాత్ర, చమురు సరఫరాలో ప్రతిష్టంభన, అంతరాయం ప్రపంచాన్ని అస్థిరత వైపు నెడుతున్నాయి. శాంతి...

15-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ త్రయోదశి రాత్రి 08.17 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం పూర్వాభాద్ర మధ్యాహ్నం 01.10 వరకు ఉత్తరాభాద్ర యోగం బ్రహ్మ ఉదయం 11.27 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం 08.41 వరకు ఉపరి...

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News