Thursday, March 19, 2026
27.2 C
Hyderabad

పవిత్ర స్నానం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహా కుంభమేళా 2025లో భాగంగా ఈరోజు ప్రయోగ రాజ్ లో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి పడవలో సంగం ఘాట్‌కు చేరుకున్న మోదీ, అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద ప్రధాని చేతిలో రుద్రాక్ష మాల పట్టుకుని మంత్రోచ్చారణ చేస్తూ స్నానం చేశారు. మోదీ రాకను గుర్తిస్తూ, ఘాట్ వద్ద భక్తులు ఆయనకు గట్టిగా స్వాగత నినాదాలు చేశారు. మోదీ ఈరోజు ప్రయాగ రాజ్ లో సుమారు రెండున్నర గంటల పాటు బస చేశారు.

2019 కుంభమేళాలో ప్రధాని మోదీ పారిశుధ్య కార్మికుల పాదాలను కడిగిన ఘటన గుర్తుండే ఉంటుంది. తాజాగా ఆయన బడే హనుమాన్ ఆలయం, అక్షయవట సందర్శించారు. ఫిబ్రవరి 5, భీష్మాష్టమిగా పిలువబడే ఈరోజు హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైనది. మహాభారతంలో భీష్ముడు తన జీవితాన్ని త్యజించిన పవిత్రమైన రోజు కావడంతో, ఈ రోజున ఉపవాసం, పూజలు, ధ్యానం చేయడం పుణ్యఫలాలను ఇస్తుందని విశ్వాసం.

Latest News

సినిమా చరిత్ర తత్వదర్శి రమేశ్ బాబు!|ESSAY|H RAMESH BABU|SPECIAL

హెచ్. రమేశ్ బాబుని స్పర్శించడమంటే, తెలంగాణ సినీ చరిత్రను తడమటమే! ఆయనతో మాట్లాడటమంటే భారతీయ సినిమాను వీక్షించడమే!! ఆయనతో గడపడమంటే.. ఒకటా, రెండా.. హిందీతోపాటు అనేక భాషల సినిమాలను దర్శించడమే!!! భారతీయ సినిమా...

పాత టైర్లు, ప్లాస్టిక్ వస్తువులతోటి పైసల పంటలు!?|ADUGU TRENDS

తెలివున్నోడు ఏడున్నా తేటగనే బత్తడు. మనం ఒల్లు వంచితే మనకు వంగనిదిని ఈ భూమ్మీద ఏముంటది? గదే నిజం సేత్తాండు గీ అన్న. ఇంట్లో ఊకుండక.. సేంద్రీయ పంటల్ని పండిత్తాండు. పాత ప్లాస్టిక్ బకీట్లు,...

ప్రకృతి, జీవతత్వ కాల జ్ఞానమే ఉగాది!|EDITORIAL

ఉగాది ఒక పండుగ మాత్రమే కాదు. కాల గమన తత్వాన్ని, జీవితత్వాన్ని, జీవిత సత్యాన్ని గుర్తుచేసే ఆత్మపరిశీలన. గతాన్ని గమనిస్తూ, వర్తమానాన్ని అర్థం చేసుకుంటూ, భవిష్యత్తుకు కొత్త ఆశలతో ముందడుగు వేయడానికి ఇది...

19-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం ఉగాది నూతన సంవత్సరాది నవారాత్రోత్సవారంభం నింబకుసుమ భక్షణం పంచాంగ శ్రవణం తిధి అమావాస్య ఉదయం 06.53 వరకు ఉపరి శు. పాడ్యమి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి తెల్ల 04.58 వరకు ఉపరి రేవతి యోగం శుక్ల రాత్రి...

శ్రీ పరాభవ నామ సంవత్సర ద్వాదశి రాశి ఫలాలు|UGADI|RASHI PHALALU

మేష రాశి (ఆదాయం:11, వ్యయం:5, రాజపూజ్యం:2 , అవమానం:4): వీరికి సాధారణంగా శుభప్రదమైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం మీరు కొత్త అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు తీసుకునే...

జిర్ర పురుగుల పుర్రె తిరిగె శిట్కా!?|ADUGU TRENDS

జిర్ర పురుగులు గదేనుల్లా బొద్దింకలు. గివీటిని సూస్తే కొందరైతే మస్తు భయపడ్తరు. మనింట, వంట గదుల్ని, మన ఆడోల్లని మస్తు ఇబ్బందీ పెట్టే బల్లులు, ఎలుకల లెక్కనే గీ జిర్ర పురుగులు, బొద్దింకలు....

గంజాయి, డ్రగ్స్ మాఫియా మరణ మృదంగం!|EDITORIAL

2016లో డ్రగ్స్ దందాపై తీసిన ఉడ్తా పంజాబ్ సినిమా సంచలనమైంది. కానీ, అతకంటే సంచలనం డ్రగ్స్, గంజాయి ఉత్పత్తి, వినియోగం, సరఫరా అని గుర్తించలేకున్నాం. ఇదే ఇప్పుడు దేశంలో మొత్తం సమాజాన్ని క్యాన్సర్...

18-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి ఉదయం 07.40 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి తెల్ల 05.27 వరకు ఉపరి ఉత్తరాభాద్ర యోగం శుభ రాత్రి తెల్ల 04.15 వరకు ఉపరి శుక్ల కరణం శకుని...

సింక్ ను సాఫ్ చేసుడింత అల్కగనా!?|ADUGU TRENDS

అరె, గిది తెల్వక గింత కాలం మస్తు తిప్పలు పడవడ్తిమి. మనం శేతులు, మూతులు, బోల్లు బొచ్చెలు కడిగే, గా సింకు గార పట్టి, గలీజైపోబట్టె. గింత అల్కగైతదని గిప్పుడే తెలిసింది. గిది...

వంట గ్యాస్ సమస్య తాత్కాలికమా? దీర్ఘకాలికమా?|EDITORIAL

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సహా, సాధారణ కుటుంబాల వంటింటినీ ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్‌–అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరిగిన ఘర్షణల కారణంగా ప్రపంచంలోని అత్యంత కీలక...

17-03-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి త్రయోదశి ఉదయం 07.56 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం శతభిషం రాత్రి తెల్ల 05.31 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం సిద్ద ఉదయం 07.19 వరకు ఉపరి సాధ్య కరణం వణజి ఉదయం...

16-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 07.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ధనిష్ఠ రాత్రి తెల్ల 05.09 వరకు ఉపరి శతభిషం యోగం శివ ఉదయం 08.15 వరకు ఉపరి సిద్ద కరణం తైతుల ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News